
స్టార్ హోటళ్లు వద్దు:
ఐపీఎల్ 2020లో ఆడేందుకు సిద్ధమవుతున్నా.. క్రికెటర్లలో వైరస్ భయం ఏ మూలో వెంటాడుతూనే ఉంది. అందుకే ప్రతీ విషయంలో వారు జాగ్రత్తలు కోరుకుంటున్నారు. మునిపటిలా సకల సౌకర్యాలు ఉండే ఫైవ్ స్టార్ హోటళ్లను ఆటగాళ్లను కోరుకోవడం లేదు. ఎందుకంటే హోటల్ మొత్తం అనుసంధానమై ఉండే ఎయిర్ కండిషనింగ్ డక్ట్‌ల ద్వారా వైరస్ వ్యాపించవచ్చనే ఆందోళన వారిలో ఉంది. ఇక పెద్ద సంఖ్యలో పర్యాటకులు, అతిథులు ఉండే హోటళ్లలో బస అంత మంచిది కాదని ఆటగాళ్లు భావిస్తున్నారు. దాంతో ఫ్రాంచైజీ యాజమాన్యాలు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాయి.

వసతి కోసం రిసార్ట్:
దుబాయ్‌లో గోల్ఫ్ రిసార్ట్‌లలో ఆటగాళ్లను ఉంచే విషయంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. మరికొన్ని ఫ్రాంఛైజీలు కూడా రిసార్టులను అద్దెకు తీసుకోవాలని చూస్తున్నాయని సమాచారం. 'హోటల్‌లో అందరినీ ప్రతీ సారి స్క్రీనింగ్ చేయడం సాధ్యమయ్యే పనికాదు. దుబాయ్‌లోని రిసార్ట్‌లలో సకల సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ ఒక్కో ఆటగాడికి ఒక్కో గదిని కేటాయించడం కష్టం కాకపోవచ్చు' అని ఒక ఫ్రాంచైజీ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. కొందరు ఆటగాళ్లు మానసిక ఉల్లాసం కోసం గోల్ఫ్ ఆడుకునేందుకు రిసార్ట్‌లలో వీలుంటుందని మరికొందరు భావిస్తున్నారు.

అద్దెకు అపార్ట్‌మెంట్:
ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ ఆటగాళ్ల కోసమే ఒక పూర్తి అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకోవాలనుకుంటోందట. అక్కడ ఒక్కో ఆటగాడికి ఒక్కో గదిని కేటాయించాలని, పూర్తి సౌకర్యాలు అక్కడే ఉండేలా చూసుకోనుందట. ఇక యూఏఈలో 6 రోజుల క్వారంటైన్ బదులు వైద్యుల సూచనలు తీసుకుంటూ కేవలం 3 రోజులకే పరిమితం చేయాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. ఆటగాళ్లు తీసుకునే ఆహారం పలువురు చేతులు మారకుండా 'కాంటాక్ట్‌లెస్ డెలివరీ' ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

క్వారంటైన్‌లో 12 రోజులు:
ఆగస్టు 20 తర్వాత టోర్నీలోని ఎనిమిది జట్లు యూఏఈకి వెళ్లనున్నాయి. యూఏఈకి వెళ్లే ముందు, అక్కడికి చేరుకున్న తర్వాత ఆరేసి రోజులు ఆటగాళ్లని క్వారంటైన్‌లో ఉంచాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. టోర్నీకి ముందు ఈ క్వారంటైన్ టైమ్‌లోనే మొత్తం ఐదు సార్లు క్రికెటర్లకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications

బాబర్ అజామ్ బౌండరీల మోత.. పాకిస్తాన్ 139/2










