Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్ ఉంటే బామ్మర్ది పెళ్లికి కూడా వెళ్లకూడదా? సునీల్ గవాస్కర్‌పై రోహిత్ శర్మ ఫైర్!

Rohit Sharma slams Sunil Gavaskar over his comment Cant Have Family Commitment In World Cup Year

న్యూఢిల్లీ: వరల్డ్ కప్ ఉంటే సొంత బామ్మర్ది పెళ్లికి కూడా వెళ్లకూడదా? అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశ్నించాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు దూరంగా ఉండటాన్ని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌తో అభిమానులు తప్పుబట్టగా.. రోహిత్ శర్మ తనదైన శైలిలో కౌంటరిచ్చాడు. ప్రతీ ఒక్కరికి కుటుంబమే ముఖ్యమని, కుటుంబం కోసం అందరూ కష్టపడేదని తెలిపాడు. 'వన్డే వరల్డ్ కప్ ఉంటే.. బామ్మర్ది పెళ్లికి వెళ్లకూడదని ఏమైనా నిబంధన ఉందా? ప్రతీ ఒక్కరికీ కుటుంబం ముఖ్యమే. ఫ్యామిలీ కంటే ఏమీ ముఖ్యం కాదు.. వరల్డ్ కప్‌‌కు ముందు అన్ని పనులు పూర్తి చేసుకోవడం కూడా ఆటగాళ్లకు చాలా ముఖ్యం. శక్తిని ఫిట్‌నెస్ కాపాడుకుంటూ ఏ పని చేసినా తప్పు లేదు.

కెప్టెన్‌గా వరుసగా మ్యాచులు ఆడుతున్నప్పుడు తీవ్రమైన ఒత్తిడి కలుగుతోంది. అలాంటప్పుడు ఫ్యామిలీ ఫంక్సన్లతో పాటు వారితో గడపడటం వల్ల చాలా రిలాక్స్ అవుతాం. కొత్తగా శక్తి వస్తుంది. అది చాలా ప్రత్యేకం.'అని రోహిత్ శర్మ తెలిపాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం తన కూతురు వామికా పుట్టే సమయంలో ఆస్ట్రేలియాతో కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని వదిలేసి వచ్చాడు. అప్పుడు కూడా కోహ్లీని విమర్శించారు. ఫ్యామిలీ కంటే ఎదీ తనకు ముఖ్యం కాదని కోహ్లీ కూడా అప్పట్లో బదులిచ్చాడు.

తాజాగా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేకు రోహిత్ దూరంగా ఉన్నాడు. తన సతీమణి రాధికా సజ్దే సోదరుడి పెళ్లి కోసం రోహిత్ బీసీసీఐ అనుమతితో లీవ్ తీసుకున్నాడు. బామ్మర్ది పెళ్లిలో రోహిత్ హల్‌చల్ చేశాడు. ఆట పాటలతో తెగ ఎంజాయ్ చేశాడు. టీమిండియా బాధ్యతల కంటే బామ్మర్ది పెళ్లి రోహిత్‌కు ఎక్కువైందని అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీల్ గవాస్కర్ కూడా రోహిత్ శర్మ తీరును తప్పుబట్టాడు. 'కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో కీలక మ్యాచ్‌లకు దూరమవ్వడం సమంజసం కాదు. రోహిత్ శర్మ ఇకనైనా ప్రతీ మ్యాచ్ ఆడాలి. వరల్డ్ కప్‌కు పెద్దగా సమయం లేదు. ఇకనైనా టీమ్ కాంబినేషన్‌పైన ఫోకస్ పెట్టాలి.

జట్టులో ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు. రోహిత్ శర్మతో పాటు హార్ధిక్ పాండ్యా.. టీ20ల్లో కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. రోహిత్ ఇలా మాటిమాటికి విశ్రాంతి తీసుకుంటూ పోతే హార్ధిక్ పాండ్యాకు వన్డే కెప్టెన్సీ ఇచ్చేస్తే మంచిది. టీమ్ కాంబినేషన్‌పై కెప్టెన్‌కు పూర్తి క్లారిటీ ఉండాలి. అలాంటి స్పష్టత రావాలంటే ప్రతీ మ్యాచ్ ఆడాలి.'అతని గవాస్కర్ మండిపడ్డాడు. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో బరిలోకి దిగిన టీమిండియా అద్భుత విజయాన్నందుకుంది. కానీ రోహిత్ రీఎంట్రీ తర్వాత ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయింది.

Story first published: Friday, March 24, 2023, 14:53 [IST]
Other articles published on Mar 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+