ఆ ఇద్దరి వైఫల్యం మా కొంపముంచింది: రోహిత్ శర్మ

దుబాయ్: కీలక సమయంలో రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా ఔటవ్వడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తమ కంటే మెరుగ్గా ఆడిందని, ఈ గెలుపు క్రెడిట్ వారిదేనని రోహిత్ కితాబిచ్చాడు. ఆసియాకప్ 2022లో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన రోహిత్.. ఈ పరాజయం తమకు ఓ గుణపాఠమని తెలిపాడు.

హై ప్రెజర్ గేమ్..
'ఇది తీవ్ర ఒత్తిడితో కూడుకున్న మ్యాచ్ అనే విషయం మాకు ముందే తెలుసు. పాక్‌తో మ్యాచ్ అంటేనే ప్రతీసారి ఇలానే ఉంటుంది. ఇలాంటి గేమ్స్‌తో ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. రిజ్వాన్, నవాజ్ మంచి భాగస్వామ్యం నెలకొల్పినా.. మేం ప్రశాంతంగానే ఉన్నాం. ఈ భాగస్వామ్యం మా విజయవకాశాలు దెబ్బతీసింది. అయితే ఇలాంటి మ్యాచ్‌లతోనే మన అసలు సత్తా ఏంటో బయటకు వస్తుంది. పాకిస్థాన్‌కు తమను ఓడించే శక్తి ఉందనే విషయం మాకు తెలుసు. అంతేకాకుండా పిచ్ మ్యాచ్ జరుగుతున్నా కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది.

క్రెడిట్ పాక్‌దే...
మేం చేసిన 181 పరుగుల స్కోర్ కాపాడుకోగలిగినదే. ఎలాంటి పిచ్‌పై అయినా ఈ స్కోర్‌ను డిఫెండ్ చేయవచ్చు. అయితే ఈ విజయం క్రెడిట్ మాత్రం పాకిస్థాన్ ఆటగాళ్లదే. వాళ్లు మాకంటే అద్భుతంగా ఆడారు. కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఓవైపు వికెట్లు పడుతూ ఉంటే మరోవైపు క్రీజులో సెట్ అయిన బ్యాటర్ కొనసాగాలి. విరాట్ ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాడు. అద్భతుంగా బ్యాటింగ్ చేశాడు. అయితే కీలక సమయంలో హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ త్వరగా ఔటయ్యారు. ఈ తప్పిదాలన్ని సవరించుకొని బలంగా బరిలోకి దిగుతాం'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

కొంపముంచిన అర్షదీప్ సింగ్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(44 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 60) మరోసారి హాఫ్ సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28), కేఎల్ రాహుల్(20 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 28) మెరుపులు మెరిపించారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, మహమ్మద్ హస్నైన్, హరీస్ రౌఫ్, మహమ్మద్ నవాజ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. బాబర్ ఆజామ్(51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71) హాఫ్ సెంచరీతో రాణించగా.. మహమ్మద్ నవాజ్(20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), అసిఫ్ అలీ(16) కీలక పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications