Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతను.. మా రిషభ్ పంత్ ఆటను చూసుండడు: రోహిత్ శర్మ

ఇంగ్లండ్ బజ్‌బాల్ అప్రోచ్‌ను చూసి టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడుతున్నాడని ఆ జట్టు ప్లేయర్ బెన్ డక్కెట్ చేసిన వ్యాఖ్యలపై కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో స్పందించాడు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆటను బెన్ డక్కెట్ చూసుండడని సెటైర్లు పేల్చాడు. అసలు ఈ బజ్‌బాల్ అంటే ఏంటో తనకు తెలియదన్నాడు.

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 3-1తో గెలుచుకున్న టీమిండియా.. ఆఖరి పోరుకు సిద్దమైంది. గురువారం నుంచి ధర్మశాల వేదికగా జరగనున్న ఐదో టెస్ట్‌లో విజయమే లక్ష్యంగా సిద్దమవుతోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Rohit Sharma slams Ben Duckett for his bazball comment on Yashasvi Jaiswal

ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిథి యశస్వి జైస్వాల్‌కు సంబంధించి బెన్ డక్కెట్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. రోహిత్ తనదైన శైలిలో బదులిచ్చాడు. 'మా జట్టులో ఒకడుండేవాడు. వాడి పేరు రిషభ్ పంత్. బహుషా బెన్ డక్కెట్ వాడి ఆటను చూసుండడు'అని రోహిత్ తెలిపాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.

బడిలో చదువు కోలేదు.. కానీ
ఇక బజ్‌బాల్ అంటే ఏంటో ఇప్పటికి తనకు తెలియదన్నాడు. 'అసలు బాజ్‌బాల్ అంటే ఏంటో నాకు తెలియదు. ఇంగ్లండ్ మాత్రం గతంలో కంటే మెరుగ్గా ఆడింది. అయినా ఇప్పటికీ ఈ బజ్‌బాల్‌ అర్థం ఏంటో తెలియదు. నేను స్కూల్లో పెద్దగా చదవుకోపోయినా.. క్రికెట్‌లో మాత్రం ప్రత్యర్థుల ఆటతీరును బాగా చదువుతాను. ఓ బ్యాటర్, కెప్టెన్‌గా నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తాను.

ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచి ఇంగ్లండ్ మాపై ఒత్తిడి పెట్టినా మేం చాలా ప్రశాంతంగా ఉన్నాం. తిరిగిపుంజుకోవడానికి కావాల్సిన మార్గాన్ని కనుగొన్నాం. ధర్మశాల పిచ్ పేస్‌ అనుకూలమా..? ర్యాంక్ టర్నరా? అనే చర్చ అనవసరం. పిచ్ ఎలా ఉన్నా మ్యాచ్ గెలవడమే మా ప్రధాన ఉద్దేశం. ర్యాంక్ టర్నర్ పిచ్ సిద్దం చేసినా.. ఇరు జట్లకు అడ్వాంటేజేస్, డిస్ అడ్వాంటేజేస్ ఉంటాయి.

ఎక్స్‌ట్రా పేసర్..
ఈ సిరీస్ గెలిచిన తీరు నాకు చాలా సంతృప్తినిచ్చింది. ధర్మశాలలో నేను ఇప్పటి వరకు టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. జట్టులో ఉన్న ఇద్దరూ స్పిన్నర్లు, పేసర్లకు మాత్రం ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. వారు 2017లో ఇక్కడ టెస్ట్ మ్యాచ్‌ ఆడారు. పిచ్ మాత్రం చూడటానికి మంచి వికెట్‌లానే కనబడుతోంది.

భారత్‌లో ఉండే సాధారణ పిచ్‌లానే ఆరంభంలో స్వింగ్ అయ్యి.. తర్వాత స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే ఇంకా తుది జట్టును ఖరారు చేయలేదు. ధర్మశాల మైదానం నా హోమ్ గ్రౌండ్ ఫీలింగ్‌ను కలిగిస్తోంది. ఇక్కడి ప్రజలు ప్రేమ అలా ఉంది.'అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, March 6, 2024, 12:59 [IST]
Other articles published on Mar 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+