Sydney Test: ఓపెనర్లుగా రోహిత్, గిల్.. విహారి మరో ఛాన్స్!! నటరాజన్‌కు షాక్!

సిడ్నీ: ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో అద్భుత విజయాన్ని అందుకున్న రహానే సేన మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. సిడ్నీ వేదికగా మూడో టెస్టు గురువారం (జనవరి 7) నుంచి ప్రారంభం కానుంది. సొంతగడ్డపై దెబ్బతిన్న పులిలా ఆసీస్ పంజా విసరడానికి సిద్ధంగా ఉంటే.. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు దూరమవడం, వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి రావడం, బయో బబుల్ నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణలు ఆటగాళ్లపై ఉండడం లాంటి ప్రతికూలతల మధ్య భారత్ బరిలోకి దిగనుంది.
అయితే రెండో టెస్టులో విజయం సాధించడం, ఆటగాళ్లందరికి నెగటివ్ రావడం, రోహిత్ శర్మ జట్టులోకి రావడం లాంటి సానుకూలాంశాలు కూడా ఉన్నాయి. మూడో టెస్ట్ కోసం తుది జట్టును ఓసారి పరిశిలిస్తే...

ఓపెనర్లుగా రోహిత్, గిల్
భారత క్రికెట్ జట్టులోని సభ్యులు, సహాయక సిబ్బంది అందరికి తాజాగా నిర్వహించిన పరీక్షలో కరోనా నెగటివ్ వచ్చింది. దీంతో రోహిత్ శర్మ, శుభమన్ గిల్, రిషబ్ పంత్ మూడో టెస్టులో ఆడడం ఖాయం అయింది. కంగారూల గడ్డపై టీమిండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పరుగులు చేయడంలో తడబడుతున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. దీంతో అతని స్థానంలో రోహిత్ ఓపెనింగ్ చేయనున్నాడని ఓ జాతీయ మీడియా పేర్కొంది. గిల్ మరో ఓపెనర్‌గా రానున్నాడు. వన్‌డౌన్‌లో చతేశ్వర్ పుజారా, నాలుగో స్థానంలో అజింక్య రహానే పక్కా.

విహారికి మరో అవకాశం
తెలుగు క్రికెటర్ హనుమ విహారికి టీమిండియా మేనేజ్మెంట్ మరో అవకాశం ఇవ్వనుందని సమాచారం. అతడు మిడిల్ ఆర్డర్‌లో ఆడనున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా టెస్ట్ సిరీస్ నుంచి వైదొలగడం మనోడికి కలిసొచ్చింది. ఇక ఆరులో వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఏడవ స్థానంలో రవీంద్ర జడేజాలు బ్యాటింగ్ చేస్తారు.
స్పెషలిస్ట్ స్పిన్నర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ఖాయం. పేస్ బౌలర్ల కోటాలో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఆడనున్నారు. ఇక మూడో పేసర్ స్థానం కోసం శార్దూల్ ఠాకూర్, టీ నటరాజన్, నవదీప్ సైనీ పోటీ పడుతున్నారు. అయితే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తగినంత అనుభవం ఉండడంతో ఠాకూర్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.

అలా ఆలోచిస్తే నట్టూకు ఛాన్స్
ఇప్పటికే గాయాలతో సీనియర్ పేసర్లు మొహ్మద్, ఉమేశ్ యాదవ్ జట్టుకు దూరమవ్వడంతో యువపేసర్లకు జస్ప్రీత్ బుమ్రా మార్గనిర్దేశం చేస్తూ పేస్ బాధ్యతల్ని మోస్తున్నాడు. వైవిధ్యంతో బౌలింగ్ చేయగలిగే టీ నటరాజన్‌కు అవకాశం ఇస్తే కచ్చితంగా బుమ్రాపై ఒత్తిడి తగ్గనుంది. ఈ విషయాన్ని టీమిండియా యాజమాన్యం ఆలోచిస్తే.. కంగారూల గడ్డపైనే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ఆటగాడిగా నటరాజన్ నిలుస్తాడు. మరి నట్టూ టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడో లేదో రేపు తేలనుంది.
రోహిత్ కొండంత బలం
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో జట్టు బాధ్యతలు అందుకున్న అజింక్య రహానే జట్టును రెండో టెస్టులో అద్భుతంగా నడిపించాడు. కెప్టెన్, బ్యాట్స్‌మన్‌గా ఆకట్టుకున్నాడు. మరోసారి అతడి నుంచి అలంటి ప్రదర్శనే టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఇక రోహిత్ కూడా జట్టులో చేరడం కొండంత బలం. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇరు జట్లు ఒక్కో గేమ్ గెలవడంతో సిరీస్ ఆసక్తికరంగా మారింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య గురువారం నుంచి మూడో టెస్టు జరగనుంది.

తుది జట్టు
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే (కెప్టెన్), హనుమ విహారి, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
T Natarajan టెస్టు జెర్సీ ధరించనుండటం ఎంతో గర్వకారణం.. కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉన్నా!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications