Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లారా విందు.. టీమిండియా ఆటగాళ్లు హాజరు!!

Rohit Sharma, Shikhar Dhawan and India teammates enjoy dinner at Brian Lara Home

ఆంటిగ్వా: టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో ఇప్పటికే భారత జట్టు టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకుని టెస్ట్ సిరీస్‌కు సిద్ధంగా ఉంది. వన్డే సిరీస్‌ అనంతరం కొంత సమయం దొరకడంతో భారత జట్టుకు విండీస్‌ మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత బ్రియాన్ లారా తన నివాసంలో విందు ఇచ్చారు. ఈ విందు పార్టీకి భారత వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు ఓపెనర్ శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, రవీంద్ర జడేజా, కేదార్‌ జాధవ్‌, యుజువేంద్ర చాహల్‌లు హాజరయ్యారు.

లారాకు ధన్యవాదాలు:

మరోవైపు ఈ పార్టీకి విండీస్‌ ఆటగాళ్లు విధ్వంసక ఓపెనర్ క్రిస్‌ గేల్‌, కీరన్‌ పొలార్డ్‌, సునీల్‌ నరైన్‌, డ్వేన్ బ్రావో సైతం హాజరయ్యారు. అందరూ కలిసి లారా నివాసంలో సందడి చేశారు. అక్కడ అందరూ కలిసి ముచ్చటించారు. అనంతరం ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బ్రావో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. 'తన నివాసంలో విందు ఏర్పాటు చేసిన లారాకు ధన్యవాదాలు. నా జట్టు సహచరులతో పాటు టీమిండియా సోదరులను కలుసుకోవడం చాలా బాగుంది' అని బ్రావో రాసుకొచ్చాడు.

భారత్ భారీ స్కోర్:

భారత్ భారీ స్కోర్:

శనివారం భారత్ ఎ, విండీస్‌ ఎ జట్ల మధ్య మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ మొదలయింది. మొదటి రోజు భారత్ భారీ స్కోర్ చేసింది. చెతేశ్వర్‌ పుజారా (100; 187 బంతుల్లో 8x4, 1X6) సెంచరీ చేసి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగగా.. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (68; 115 బంతుల్లో 8X1, 1X6) హాఫ్ సెంచరీతో రాణించాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి భారత్ 297 పరుగులు చేసింది. హనుమ విహారీ (37; 101 బంతుల్లో 2X4), జడేజా (1) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.

న్యూజిలాండ్‌పై శ్రీలంక విజయం.. లంక ఖాతాలో అరుదైన ఘనత

22న తొలి టెస్టు:

22న తొలి టెస్టు:

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్, విండీస్ మధ్య ఈనెల 22న తొలి టెస్టు ప్రారంభం కానుంది. దీంతో టెస్టు సిరీస్‌పై మరింత ఆసక్తి పెరిగింది. భారత జట్టులోకి టెస్టు ఆటగాళ్లు చెతేశ్వర్‌ పుజారా, మయాంక్‌ అగర్వాల్‌, అజింక్యా రహానే, జస్ప్రిత్‌ బుమ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్ శర్మ రానున్నారు. టెస్టు సిరీస్‌ను కూడా భారత్ చేజిక్కించుకుంటే.. ఒకే పర్యటనలో విండీస్ గడ్డపై మూడు ఫార్మాట్ల సిరీస్‌లను తొలిసారి గెలుచుకున్న రికార్డును కోహ్లీ సేన సృష్టిస్తుంది.

Story first published: Sunday, August 18, 2019, 18:08 [IST]
Other articles published on Aug 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+