Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా నా సిద్ధాంతం ఇదే: రోహిత్ శర్మ

Rohit Sharma shares his thoughts on leadership and says as per his own theory of captaincy

న్యూఢిల్లీ: సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఒకడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)‌లో ముంబై ఇండియన్స్ సారథిగా హిట్‌మ్యాన్ నాలుగు టైటిళ్లు అందించాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో వైస్ కెప్టెన్‌గా భారత జట్టును ఈ ముంబైకర్ అద్భుతంగా నడిపించాడు. అయితే కెప్టెన్​గా ఉన్నప్పుడు తనను తాను జట్టులో తక్కువ ప్రాధాన్యమున్న వ్యక్తిగా భావిస్తానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రోహిత్ తెలిపాడు.

సారథిగా ఉన్నప్పుడు మిగిలిన ఆటగాళ్లు ఎంతో ముఖ్యమని భావించి ప్రాధాన్యమివ్వాలని, ఈ సిద్దాంతం తనకు బాగా ఉపయోగపడిందన్నాడు. అలాగే కెప్టెన్​గా ఉన్న సమయంలో కోపం, భావోద్వేగాలను దాచుకోవడం ఎంతో ముఖ్యమని కూడా ఈ ముంబైకర్ అభిప్రాయపడ్డాడు.

'కెప్టెన్​గా ఉన్నప్పుడు నువ్వే తక్కువ ప్రాధాన్యమున్న వ్యక్తి.. అనే సిద్దాంతాన్ని నేను నమ్ముతాను. ఇలా అయితే ఎక్కువ విషయాల్లో జట్టులోని ఇతర ఆటగాళ్లు ముఖ్యమైన వారవుతారు. అయితే కెప్టెన్లలో ఒక్కొకరి ఒక శైలి ఉంటుంది. నేనైతే ఈ థియరీని ఫాలో అవుతా. ఇది నాకు మంచి ఫలితాలను ఇచ్చింది. సాధారణంగా కోపం, చిరాకు వస్తాయి. కానీ కెప్టెన్​గా ఉన్నప్పుడు అది జట్టు సభ్యులపై ఏ మాత్రం చూపించకూడదు. సారథిగా కోపం, భావోద్వాగాలను అదుపులో ఉంచుకోవడం ఎంతో కీలకం'అని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.

ఇక ఐపీఎల్‌కు ముందు మాకు చాలా సమయం దొరకడంతో ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టినట్లు చెప్పిన రోహిత్.. ముంబైలో వర్షాలు, వాతావరణం కారణంగా బయటకు వెళ్లి వర్కౌట్స్ చేసే పరిస్థితి నెలకొందన్నాడు. దాంతో ఇంట్లోనే జిమ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. దుబాయ్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, అక్కడ ఆడటం అంత సులువకాదని అభిప్రాయపడ్డాడు.

Story first published: Wednesday, August 5, 2020, 21:56 [IST]
Other articles published on Aug 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+