
హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా క్రీడా టోర్నీలన్నీ నిలిచిపోవడంతో క్రికెటర్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ఎన్నడూ లేని విధంగా లభించిన ఈ విరామాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు. ఎక్కువగా సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. అభిమానులకు అందుబాటులో ఉంటూ, ఆసక్తికర విశేషాలు పంచుకుంటున్నారు. తాజాగా భారత పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన కూతురు సమైరాకు సంబంధించిన ఓ క్యూట్ పిక్‌ను తాజాగా సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఫొటోలో బుట్టబొమ్మలా ఉన్న సమైరా చుట్టూ అనేక బొమ్మలు ఉన్నాయి. వీటితో సమైరాకు అస్సలు బోర్ కొట్టదని, మంచి కంపెనీ దొరికిందని రోహిత్ తెలిపాడు.
ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అభిమానులు లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు సమైరాకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు. ఇటీవలే భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను సమైరా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను రోహిత్ షేర్ చేయగా అది వైరలైంది. సాధారణంగా ఈ సమయంలో రోహిత్.. ఐపీఎల్ మ్యాచ్‌లతో బిజీగా ఉండేవాడు. అయితే కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీ నిరవధికంగా వాయిదా పడింది. ఐపీఎల్లో 188 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 31.60 సగటుతో 4,898 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కి సారథ్యం వహిస్తున్న రోహిత్.. జట్టుకు నాలుగుసార్లు టైటిల్ అందించి ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు.