IND vs AFG: రోహిత్ శర్మ హ్యాట్రిక్(వీడియో)
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ హ్యాట్రిక్‌తో సత్తా చాటాడు. అయితే బౌలింగ్‌లో కాకుండా ఫీల్డింగ్‌లో హ్యాట్రిక్ సాధించాడు. అఫ్గానిస్థాన్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న మూడో వన్డేల్లో రోహిత్ శర్మ వరుసగా మూడు క్యాచ్‌లు అందుకున్నాడు. అతని స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో అఫ్గాన్ ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్(5), రెహ్మాత్ షా(5), ఇబ్రహీం జడ్రాన్(11) వరుసగా పెవిలియన్ చేరారు. ఈ మూడు వికెట్లను ప్రసిధ్ కృష్ణనే తీయడం గమనార్హం.
ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగగా.. ప్రసిధ్ కృష్ణ ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బతీసాడు. రెండో ఓవర్‌లోనే ఔట్ స్వింగర్‌తో రెహ్మానుల్లా గుర్బాజ్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. గుర్బాజ్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ చేతిలో పడింది.

ఎగిరి గంతేసిన హిట్ మ్యాన్
ప్రసిధ్ వేసిన ఆరో ఓవర్ ఆఖరి బంతిని రెహ్మత్ షా మిడ్ వికెట్ దిశగా ఫ్లిక్ షాట్ ఆడబోగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. స్లిప్‌లో ఉన్న రోహిత్ ఎడమవైపు జరిగి ఈజీగా అందుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన 8వ ఓవర్ రెండో బంతిని ఇబ్రహీం జడ్రాన్.. కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ చేతిలోకి దూసుకెళ్లింది.
హ్యాట్రిక్ క్యాచ్‌లు అందుకోవడంతో రోహిత్ శర్మ ఎగిరి గంతేసాడు. ప్రస్తుతం రోహిత్ శర్మకు సంబంధించిన హ్యాట్రిక్ క్యాచ్‌ల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రోహిత్ శర్మపై ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
రోహిత్ అరుదైన ఘనత..
ఈ హ్యాట్రిక్ క్యాచ్‌లతో రోహిత్ శర్మ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఒకే పేసర్ బౌలింగ్‌లో 3 క్యాచ్‌లు పట్టిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. 2004లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్‌లో వీవీఎస్ లక్ష్మణ్ తొలిసారి ఈ ఫీట్ సాధించాడు. 2018లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో శిఖర్ ధావన్ ఈ ఘనతను అందుకున్నాడు. అలాగే ఒకే ఇన్నింగ్స్‌లో తొలి మూడు క్యాచ్‌లు అందుకున్న నాలుగో భారత ప్లేయర్‌గా కూడా రోహిత్ నిలిచాడు. గతంలో సౌరవ్ గంగూలీ, మనోజ్ తివారీ, సురేష్ రైనా ఈ ఫీట్ సాధించారు.
ఇక ప్రసిధ్ కృష్ణ వేసిన 10వ ఓవర్ రెండో బంతికి డార్వాష్ రసూలీ(1) కూడా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ క్యాచ్‌ను శ్రేయస్ అయ్యర్ అందుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ ధాటికి అఫ్గానిస్థాన్ 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
మూడు మార్పులతో టీమిండియా..
ఈ మ్యాచ్‌లో టీమిండియా మూడు మార్పులు చేయగా.. అఫ్గానిస్థాన్ నాలుగు మార్పులు చేసింది. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ప్రసిధ్ కృష్ణ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డితో పాటు హర్ష్‌దూబే రీఎంట్రీ ఇవ్వగా కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ చోటు కోల్పోయారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

