Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా అభిమానిపైనే చేయి వేస్తావా? సెక్యూరిటీపై రోహిత్ శర్మ ఫైర్!(వీడియో)

తనను చూసేందుకు వచ్చిన ఓ చిన్నారి అభిమానిని అడ్డుకున్న సెక్యూరిటీపై టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నా అభిమానిపైనే చేయి వేస్తావా?'అని సెక్యూరిటీని మందలించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ కోసం రోహిత్ శర్మ సన్నదమవుతున్న విషయం తెలిసిందే. ముంబైలోని శివాజీ పార్క్ స్టేడియంలో రోహిత్ కఠినంగా శిక్షణ పొందుతున్నాడు. టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో రోహిత్.. ఆసీస్ పర్యటనకు సిద్దమవుతున్నాడు. గంటల కొద్దీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ముఖ్యంగా భారీ షాట్స్ ఆడటంపై ఫోకస్ పెట్టాడు. అతను కొట్టిన ఓ సిక్సర్‌ నేరుగా రోహిత్ లాంబోర్గినీ కారు అద్దాలను ధ్వంసం చేసింది.

Rohit Sharma Scolds Security for Stopping Young Fan Invites Boy onto Field

రోహిత్ శర్మ ప్రాక్టీస్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఈ స్టేడియానికి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ రోహిత్ వైపు దూసుకొచ్చిన ఓ చిన్నారి అభిమానిని సెక్యూరిటీ అడ్డుకుంది. ఆ చిన్నారితో సెక్యూరిటీ సిబ్బంది కాస్త దురుసుగానే ప్రవర్తించింది. ఈ విషయాన్ని గమనించిన రోహిత్.. సెక్యూరిటీపై అరుస్తూ... అతన్ని పంపించాలని సూచించాడు. అభిమానుల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని తప్పుబడుతూ వారిని మందలించాడు. రోహిత్ సూచనలతో సదరు అభిమానిని సెక్యూరిటీ వదిలేయగా.. అతను సెల్ఫీ తీసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

రోహిత్ శర్మ ఆటోగ్రాఫ్స్ కోసం అభిమానులు ఎగబడటంతో అభిషేక్ నాయర్ చేతులు జోడించి విజ్ఞప్తి చేశాడు. రోహిత్‌కు అసౌకర్యం కలిగించవద్దని వేడుకున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్.. అందుకోసం అన్ని విధాల సన్నదమవుతున్నాయి. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన రోహిత్.. 20 కేజీల బరువు తగ్గాడు. సన్నగా మారిపోయాడు. మరోవైపు టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం రోహిత్, కోహ్లీ.. వన్డే ప్రపంచకప్ 2025 ఆడటంపై సందేహంగా ఉంది. అప్పటికి రోహిత్ వయసు 40 ఏళ్లకు చేరనుంది.

Story first published: Saturday, October 11, 2025, 18:15 [IST]
Other articles published on Oct 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+