Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs USA: అందుకే తుది జట్టును మార్చలేదు: రోహిత్ శర్మ

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా అమెరికాతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.

తుది జట్టులో మార్పు జరుగుతుందని జోరుగా ప్రచారం జరగ్గా.. ఎలాంటి మార్పు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నామని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చే ఉద్దేశం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.

Rohit Sharma says We re playing the same team against USA in T20 World Cup 2024

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. గత రెండు మ్యాచ్‌ల కంటే ఈ వికెట్ మెరుగ్గా ఉంటుంది. వీలైనంత త్వరగా పరిస్థితులను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడి మ్యాచ్‌పై పట్టు బిగించాలి.

ఈ టోర్నీలో ముందుకు సాగాలంటే నిలకడగా రాణిస్తూ మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే. సరైన ప్రణాళికలతో బరిలోకి దిగడం ముఖ్యం. గత మ్యాచ్ చాలా మంచి గేమ్. స్వల్ప లక్ష్యాన్ని అయినా మా బౌలర్లు డిఫెండ్ చేసి అద్భుత విజయాన్ని అందించారు. మేం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని అమెరికా కెప్టెన్ ఆరోన్ జోన్స్ అన్నాడు. ఈ వికెట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుదన్నాడు. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు మోనంక్ పటేల్ దూరమయ్యాడని, దాంతో తాను సారథ్య బాధ్యతలు చేపట్టానని తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాలనే లక్ష్యంతో తాము బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. తమ ఆటగాళ్లంతా చాలా సానుకూలంగా ఉన్నారని, గుడ్ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. తుది జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పిన ఆరోన్ జోన్స్.. మోనాంక్ పటేల్ స్థానంలో జహంగీర్, నోష్‌తుష్ స్థానంలో షాడ్లీ బరిలోకి దిగుతున్నారని చెప్పాడు.

తుది జట్లు:

యూఎస్‌ఏ: స్టీవెన్ టేలర్, శాయన్ జహంగీర్, ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, నితీష్ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, షాడ్లీ, జస్‌దీప్ సింగ్, సౌరభ్ నెత్రావల్కర్, అలీ ఖాన్.

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్.

Story first published: Wednesday, June 12, 2024, 19:55 [IST]
Other articles published on Jun 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+