For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఒక్క స్థానమే కాదు.. అన్నీ ముఖ్యమే: రోహిత్ శర్మ

న్యూఢిల్లీ: ఆసియాకప్ 2023 టోర్నీలో స్పష్టమైన ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. జట్టులోని ఆటగాళ్లు జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. ఏ ఒక్క స్థానంలో మెరుగ్గా రాణించినంత మాత్రానా విజయాలు దక్కవని, సమష్టి ప్రదర్శనతోనే టైటిల్ గెలవమన్నాడు.

ఆసియాకప్ 2023 టోర్నీ కోసం ఎంపిక చేసిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటిచింది. 17 మంది సభ్యులతో కూడిన జట్టును చీఫ్ సెలెక్టర్ అగార్కర్.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రకటించాడు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఈ ఇద్దరూ ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. గత కొంతకాలంగా టీమిండియా వేధిస్తున్న నెంబర్ 4 సమస్యపై రోహిత్ శర్మను ప్రశ్నించగా.. అతను లెక్కలేసి మరి సమాధానం చెప్పాడు.

Rohit Sharma says We want players who can bat in any position

'ఒక్క స్థానం గురించి కాదు. జట్టులో అన్ని స్థానాలు ముఖ్యమే. గాయాల సమస్య ఉంది. అలాంటప్పుడు మిగిలిన ఆటగాళ్లు వర్క్ లోడ్ భరించాలి. ఎవరు ఏ స్థానంలో ఆడుతారన్నది పరిస్థితులను బట్టి మారుతోంది.

జట్టులో ఏ ఒక్కరు కూడా మేం ఇదే స్థానంలో సౌకర్యంగా ఆడుతామని చెప్పరు. జట్టు అవసరాలకు తగ్గట్లు ఎవరు ఎక్కడైనా ఆడాలని మేం కోరుకుంటున్నాం. ఇప్పుడే కాదు గత కొన్నేళ్లుగా ఇదే పద్దతిని కొనసాగిస్తున్నాం. ఇది అంతర్జాతీయ క్రికెట్.. క్లబ్ క్రికెట్ కాదు. జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడాల్సిందనే విషయాన్ని ఆటగాళ్లకు తెలియజేశాం.

ఒక్క పొజిషన్‌లో స్టక్ అవ్వాలని మేం కోరుకోవడం లేదు. మా ఆటగాళ్ల అసలు సిసలు సత్తాను బయటకు తీయాలనుకుంటున్నాం. ఎవరి బ్యాటింగ్ పొషిషన్ శాశ్వతం కాదనే విషయాన్ని స్పష్టం చేశాం. ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడేందుకు సిద్దంగా ఉండాలని చెప్పాం.

ఫేవరిటిజం అనే ట్యాగ్‌లను నేను అస్సలు నమ్మను. ఇదంతా బయటి వారి కోసం సృష్టించిందే. మేం బాగా ఆడాలి. ఇతర జట్లు కూడా గట్టి పోటీనిస్తాయి. సొంతమైదానాల్లో ఆడుతున్నప్పుడు కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ దాంతోనే గెలుస్తామా? అంటే కాదు. ప్రపంచకప్ ముందు మమ్మల్ని మేం పరీక్షించుకునేందుకు ఇది సరైన టోర్నీ.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ఆసియాకప్ 2023 కోసం ఎంపిక చేసిన భారత జట్టు:
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.

స్టాండ్‌బై ప్లేయర్: సంజూ శాంసన్

Story first published: Monday, August 21, 2023, 22:58 [IST]
Other articles published on Aug 21, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+