Rohit Sharma: ఈ కష్టకాలంలో ఎంతో మంది పనిచేయలేకపోతుంటే.. మేం మాకు నచ్చిన ఆట ఆడుతున్నాం

చెన్నై: కరోనా కష్టకాలంలో ఎంతో మంది పనిచేయలేకపోతుంటే.. తాము మాత్రం నచ్చిన ఆట ఆడుతున్నామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఇందుకు తామెంతో అదృష్టవంతులమని పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే ఫస్ట్ ఫైట్‌తో 52 రోజుల ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ మీడియా టీమ్‌తో మాట్లాడిన రోహిత్ శర్మ.. బయో బబుల్, కరోనా టైమ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియోను ముంబై ఫ్రాంచైజీ ట్విటర్‌లో పంచుకుంది.
మేం చాలా అదృష్టవంతులం..
'ప్రస్తుతం చాలా మంది కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎంతో మంది పనిచేయలేకపోతుంటే మరెంతో మంది తమకు నచ్చిన పనులు చేయలేకపోతున్నారు. ఇలాంటి స్థితిలో మేం ఇష్టపడే క్రికెట్ ఆడగలుగుతున్నందుకు అదృష్టవంతులం. కాబట్టి కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తే తప్పకుండా చేసుకుంటాం. బయో బబుల్ కష్టాలను ఓర్చుకుంటాం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌పై సాధించిన విజయాలు భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచాయి.

ఆసీస్ టూర్ విజయం..
ఆస్ట్రేలియా పర్యటనలో భారత ప్రదర్శనను ఈ ప్రపంచం మొత్తం చూసింది. మా సమష్టి ప్రదర్శన సంతోషాన్నించింది. ముఖ్యంగా యువ ఆటగాళ్లు సత్తాచాటడం, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం గొప్ప అనుభూతినిచ్చింది. ఆ తర్వాత భారత్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో విజయం సాధించడం కూడా మా ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఇంగ్లండ్ చాలా బలమైన జట్టు. గత కొన్నేళ్లు ఆ టీమ్ అద్భుతంగా రాణిస్తుంది. అలాంటి పటిష్టమైన జట్టును ఓడించడంతో మా ఆత్మవిశ్వాసాం అమాంతం పెరిగిపోయింది.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

గతేడాది చాలా కష్టంగా..
ఇక గతేడాది యూఏఈ వేదికగా బయోబబుల్‌లో ఉండటం చాలా కష్టంగా అనిపించిందని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. 'యూఏఈలోని బబుల్ నాకు కొంచెం కష్టంగానే అనిపించింది. ఎందుకంటే నేను గాయపడ్డాను. ఆ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొవడం అంత సులువు కాదు. ఆ తర్వాత ప్రతిష్టాత్మ ఆసీస్ పర్యటనలో కొన్ని మ్యాచ్‌లకు దూరం కావాల్సి వచ్చింది. అలాగే బబుల్‌లో ఆస్వాదించి క్షణాలు లేకపోలేదు. మరీ ముఖ్యంగా యూఏఈలో ఐపీఎల్ సందర్భంగా బబుల్‌లో ఎంజాయ్ చేశాం. ఇంగ్లండ్‌తో సిరీస్‌ల సందర్భంగా కూడా సరదాగా గడిపాం. టీమ్ రూమ్‌లో పిచ్చపాటిగా మాట్లాడుకున్నాం.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

చావ్లా రాణిస్తాడు..
వెటరన్ స్పిన్నర్ చావ్లా పై రోహిత్ ప్రశంసల జల్లు కురిపించాడు. 'అండర్-19 నుంచి పియూష్‌తో కలిసి ఆడాను. దూకుడైన బౌలర్. మా స్పిన్ విభాగంలో కోరుకుంటున్నదీ అదే. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన అతడిని తీసుకోవడం బాగుంది. ఐపీఎల్, ఫార్మాట్, ప్రత్యర్థులు, ఆటగాళ్ల గురించి అతడికి బాగా తెలుసు.' అని రోహిత్ ప్రశంసించాడు. ఇక ఈసీజన్‌కు ముందు పీయూష్‌ను చెన్నై వదిలేయగా.. ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications