Rohit Sharma: లీడర్లను తయారు చేస్తా.. బుమ్రాకు ఆ సత్తా ఉంది!

లక్నో: ఓ యంగ్ బ్యాటర్‌గా టీమిండియాలోకి వచ్చిన రోహిత్ శర్మ ఇప్పుడు అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా ఎదిగాడు. ధోనీ అతనికి అవకాశాలు ఇచ్చి నాయకుడిగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు టీమ్‌లో కెప్టెన్‌గా, పెద్దన్నలా ఉన్న తాను కూడా టీమ్‌లోని ఇతర యువ ఆటగాళ్లను లీడర్లుగా తయారు చేస్తానని చెబుతున్నాడు. అలా చేసేందుకు సంతోషంగా ఉన్నానని, ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియని హిట్‌మ్యాన్ అభిప్రాయపడ్డాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో జరగనున్న తొలి టీ20 నేపథ్యంలో రోహిత్ శర్మ.. మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా భవిష్యత్తు కెప్టెన్లను తీర్చిదిద్దుతానని తెలిపాడు.

బుమ్రా కెప్టెన్‌గా రాణించగలడు..
‘మమ్మల్ని ఎవరో ఒకరు తీర్చిదిద్దారు. అలాగే భవిష్యత్తులో కెప్టెన్ అయ్యే సత్తా ఉన్న వాళ్లను లీడర్లుగా తీర్చిదిద్దే బాధ్యత సంతోషంగా నిర్వర్తిస్తా. రాహుల్, బుమ్రా, పంత్.. టీమ్ విక్టరీల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక టైమ్‌లో వీళ్లు లీడర్లు కూడా అవుతారు. కెప్టెన్ అవ్వడానికి బ్యాటర్, బౌలర్ అన్న తేడాలేమి లేదు. బుమ్రాను నేను దగ్గరగా చూశా. తను ఓ లీడర్‌గా తప్పకుండా రాణించగలడు'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

అన్ని మ్యాచ్‌లకు రెడీ..
అలాగే టీమిండియా తరఫున అన్ని మ్యాచ్‌లు ఆడేందుకు తాను రెడీగా ఉన్నానని రోహిత్ స్పష్టం చేశాడు. అలసటగా అనిపిస్తే అప్పుడు బ్రేక్ గురించి ఆలోచిస్తానని తెలిపాడు. ఇక డొమెస్టిక్ ప్లేయర్లు రంజీట్రోఫీపై ఫోకస్ పెట్టాలని సూచించాడు. అక్కడ మంచి పెర్ఫామెన్స్ చేస్తే టీమిండియా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అభిప్రాయపడ్డాడు.

సూర్య దూరం..
గాయం కారణంగా శ్రీలంకతో జరగనున్న ఈ టీ20 సిరీస్‌కు ఇన్‌ఫామ్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యాడు. ఇక ఈ 360 ప్లేయర్ దూరమవడంపై స్పందించిన రోహిత్ శర్మ విచారం వ్యక్తం చేశాడు. ‘సూర్యకుమారద్ యాదవ్ జట్టుకు దూరమవడం బాధాకరం. ప్రస్తుతం సూర్య మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడి స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు బెంచ్‌లో ఉన్నారు. కాబట్టి ఆందోళన అవసరం లేదు. వెస్టిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో గాయపడిన సూర్యకుమార్ యాదవ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ప్రయోగాల్లేవ్..
వెస్టిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో చేసిన ప్రయోగం ఆ మ్యాచ్ వరకేనని, ఇక నుంచి తానే రెగ్యూలర్‌గా ఓపెనర్‌గా వస్తానని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్‌నకు ఎక్కువ దూరం లేదని అందుకే ప్రయోగాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపాడు. కాగా విండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ఆరంభించగా రోహిత్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అలాగే విండీస్‌తో రెండో వన్డే మ్యాచ్‌లో మిడిలార్డర్ బ్యాటర్ రిషభ్ పంత్ రోహిత్‌కు జతగా ఓపెనింగ్ చేశాడు. కాగా ఈ రెండు ప్రయోగాలు విజయవంతంగా కాక పోగా బెడిసికొట్టాయి. ఈ కారణంతో ప్రయోగాలకు దూరంగా ఉండాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావించినట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications