Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదేం దిక్కుమాలిన టెక్నాలజీ.. మా ఐపీఎల్ ఎంతో నయం: రోహిత్ శర్మ

లండన్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో శుభ్‌మన్ గిల్ ఔటైన తీరుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగానే గిల్ ఔటయ్యాడని తెలిపాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఉపయోగించిన కెమెరాల్లో అల్ట్రా మోషన్, జూమ్ యాంగిల్స్ చూపించే టెక్నాలజీ లేకపోవడం ఏంటని అసహనం వ్యక్తం చేశాడు.

ఆస్ట్రేలియాతో ఆదివారం ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో సమష్టిగా విఫలమైన టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్.. శుభ్‌మన్ గిల్ వివాదాస్పద రీతిలో ఔటవ్వడంపై స్పందించాడు. 'ఐపీఎల్‌లో 10 విభిన్నమైన కోణాల్లో చూపించే కెమెరాలున్నాయి.

Rohit Sharma says We have 10 different angles in the IPL On Shubman Gills catch Dismissal.

శుభ్‌మన్ గిల్ క్యాచ్‌‌ను అల్ట్రా మోషన్, జూమ్ యాంగిల్స్‌లో ఎందుకు చూపించలేదో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.'అని రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. ఇక డబ్ల్యూటీసీ విజేతను ఒక మ్యాచ్‌తో నిర్ణయించడం సరికాదని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో ఈ ఛాంపియన్‌షిప్ విజేతను తేల్చడం సరైనదని తెలిపాడు.

'మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహించడం సరైన పద్దతి. గత రెండేళ్లలో మేం విదేశాల్లో అద్భుత విజయాలు అందుకున్నాం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ గడ్డపై విజయాలు సాధించాం. మాకు దక్కిన అతి తక్కువ సమయంలోనే జట్టులోని ప్రతీ ఒక్కరు డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం అద్భుతంగా ప్రిపేర్ అయ్యారు. ఇలాంటి కీలక మ్యాచ్‌లకు సిద్దం కావాలంటే కనీసం 20-25 రోజుల సమయం ఉండటం చాలా ముఖ్యం.

గత ఇంగ్లండ్ పర్యటనలో మాకు ఇంతే సమయం దొరికింది. దాంతో విజయాలందుకున్నాం. డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహించడానికి జూన్ నెల ఒక్కటే లేదు. అలాగే ఇంగ్లండ్‌లోనే నిర్వహించాలనే రూల్ కూడా ఏం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఈ మ్యాచ్‌ నిర్వహించవచ్చు. ఐసీసీ ట్రోఫీ గెలవడం కంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. ఈ ఓటమితో జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరు తీవ్ర నిరాశకు గురయ్యారు.

గత 8-9 ఏళ్లుగా మేం కీలక మ్యాచ్‌ల్లో ఓటమిపాలవుతున్నాం. వన్డే ప్రపంచకప్ కోసమైనా మేం విభిన్నంగా ఆలోచించాలి. టీమ్ ఎంపికపై సీరియస్‌గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(78 బంతుల్లో 7 ఫోర్లతో 49), అంజిక్యా రహానే(108 బంతుల్లో 7 ఫోర్లతో 46), రోహిత్ శర్మ(60 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ నాలుగు వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్ మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్‌కు రెండు వికెట్లు దక్కగా.. ప్యాట్ కమిన్స్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Sunday, June 11, 2023, 19:18 [IST]
Other articles published on Jun 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+