For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీపై రోహిత్ శర్మ ప్రశంసలు.. విజయంపై భారత కెప్టెన్‌కు ఉన్న ఆకలి అసాధారణం!

Rohit Sharma Says Virat Kohlis Hunger For Success Is Unbelievable Ahead Of IND vs AFG
T20 World Cup : Kohli కి అండగా Team India | IND VS AFG || Oneindia Telugu

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అతని సహచర ఆటగాడు, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అండగా నిలిచాడు. కోహ్లీ ఓ అసాధారణమైన ఆటగాడని, అతను సాధించిన రికార్డ్స్ మాములివి కావని ప్రశంసించాడు. అఫ్గానిస్థాన్‌తో బుధవారం జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో ఐసీసీ రూపొందించిన వీడియోలో మాట్లాడిన రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.

'విరాట్ కోహ్లీకి విజయం ఉన్న ఆకలి అసాధారణమైనది. అతను ప్రతీరోజు తనను తాను మార్చుకుంటాడు. అతని గణంకాలు చూస్తేనే ఈ విషయం అర్థం అవుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం నిలకడగా రాణించడం మాములు విషయం కాదు. అతను అరంగేట్రం చేసిన 2008 నుంచి ప్రతీ ఏడాదిగా మెరుగ్గా రాణిస్తూ గొప్ప ప్లేయర్‌గా ఎదిగాడు. అతని ఎదుగుదలను దగ్గర నుంచి నేను చూశాను.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే వీడియోలో మాట్లాడిన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, గ్లేన్ మ్యాక్స్‌వెల్ కోహ్లీని కొనియాడారు. అతను ఫామ్‌‌లో ఉంటే ఏ బౌలర్ కూడా ఆపలేరని జడేజా పేర్కొనగా.. మూడు ఫార్మాట్లలో రాణిస్తున్న అత్యుత్తమ బ్యాట్స్‌మన్ కోహ్లీ అని అశ్విన్ ప్రశంసించాడు.

ఇక టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు వైఫల్యం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా కోహ్లీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. చివరి అతని 9 నెలల కూతురు వామికను కూడా విడిచిపెట్టలేదు. అతని సతీమణి అనుష్కశర్మ, కూతరు పట్ల జుగుప్సాకరమైన ట్రోలింగ్‌కు దిగారు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ, సహచర ఆటగాళ్లు కోహ్లీకి అండగా నిలవడం జట్టు క్యారెక్టర్‌ను తెలియజేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

ప్రపంచకప్‌ టోర్నీలో న్యూజిలాండ్, పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్ సెమీస్ అవకాశాలను గల్లంతు చేసుకుంది. మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిచినా ముందంజ వేయలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో నేడు అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. అయితే టీమిండియా వైఫల్యం చూస్తుంటే ఈ మ్యాచ్‌లోనైనా గెలుస్తుందా? అనే సందేహం కలుగుతోంది. అఫ్గానిస్థాన్‌పై టి20 ప్రపంచకప్‌లో రెండు సార్లు తలపడిన భారత్‌ రెండుసార్లూ గెలుపొందింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఫార్మాట్‌లో ఆ జట్టు ఎంతో మెరుగు పడింది.

ఒక ఓవర్‌ ఫలితాన్ని మార్చేసే అవకాశం ఉన్న టీ20ల్లో అఫ్గాన్‌ ఎన్నో సార్లు సంచలనాలకు చేరువగా వచ్చింది. ఈ టోర్నీలో కూడా ఆసిఫ్‌ అలీ అనూహ్యంగా చెలరేగి ఉండకపోతే పాక్‌పై కూడా అఫ్గాన్‌ గెలిచేదేమో! కాబట్టి టీమ్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఒకవైపు వికెట్లు పడినా, మరోవైపు ఆత్మరక్షణలో పడకుండా ధాటిగా ఆడుతూ చకచకా పరుగులు సాధించగల బ్యాట్స్‌మెన్‌ జట్టులో ఉన్నారు.

Story first published: Wednesday, November 3, 2021, 15:07 [IST]
Other articles published on Nov 3, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+