For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ ఓపెనింగ్‌ చేస్తే నాకేలాంటి అభ్యంతరం లేదు.. అలా అని రాహుల్‌ను పక్కనపెట్టలేదు: రోహిత్ శర్మ

Rohit Sharma says Virat Kohli opening does not send any signal that KL Rahul will not be considered in T20Is

అహ్మదాబాద్‌: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వస్తే తనకెలాంటి అభ్యంతరం లేదని వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. అంతేకాకుండా కోహ్లీ ఓపెనింగ్ వచ్చినంత మాత్రానా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌ను టీ20ల నుంచి పక్కనపెట్టినట్లు కాదని కూడా స్పష్టం చేశాడు. ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్ వేదికగా శనివారం జరిగిన ఆఖరి టీ20లో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ గెలుపుతో 5 టీ20ల సిరీస్‌ను 3-2తో కోహ్లీసేన కైవసం చేసుకుంది. అయితే ఆఖరి మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 నాటౌట్‌) దుమ్మురేపాడు. రోహిత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలతో కలిసి వరుసగా 94, 49, 81 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

నాకేలాంటి అభ్యంతరం లేదు..

నాకేలాంటి అభ్యంతరం లేదు..

ఈ నేపథ్యంలో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మీడియాతో మాట్లాడుతూ కోహ్లీ ఓపెనింగ్ రావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా విరాట్‌పై హిట్‌మ్యాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. 'కోహ్లీ ఓపెనర్‌గా వస్తే నాకు అభ్యంతరం ఎందుకుంటుంది. మ్యాచ్‌ గెలవాలనే ప్రయత్నంలోనే ఇలాంటి ప్రయోగాలకు సిద్ధపడుతుంటాం. జట్టుకు మేలు చేసే అంశాలపై మేమంతా చర్చిస్తాం. విరాట్ కోహ్లీ ఓపెనింగ్ రావడం జట్టుకు మేలు చేస్తుందని భావిస్తే దాన్ని కొనసాగిస్తాం. జట్టుకు అవసరమైన దశలో ఒక బ్యాట్స్‌మన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఏ స్థానంలోనైనా వచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. అదే కోహ్లీ చేశాడు.. అతనికి ఓపెనర్‌గా రాణించగలనన్న నమ్మ​కం ఉండడం అదనపు బలం. జట్టులో ఒక కెప్టెన్‌ ఈ విధంగా ఉంటేనే మ్యాచ్‌లు గెలవగలం.

బయటితో అనవసం..

బయటితో అనవసం..

బయట ఏం అనుకుంటున్నారనేది మాకు అనవసరం.. ఓపెనింగ్‌లో ఎవరు ఆడాలి.. ఎవరు ఆడకూడదనేది నిర్ణయించే హక్కు కెప్టెన్‌కు ఉంటుంది. ఫామ్‌లో ఉన్న ఆటగాడు ఓపెనర్‌గా వచ్చినా.. వన్‌డౌన్‌లో వచ్చినా ఆడేది మాత్రం అతనే కదా. ఇషాన్‌ కిషన్‌ ఓపెనర్‌గా సక్సెస్‌ అయ్యాడు.. కోహ్లీ కూడా సక్సెస్‌ అయ్యాడు. జట్టు ప్రయోజనాల కోసం కోహ్లీ ఓపెనర్‌గా వస్తే నాకు అభ్యంతరం ఎందుకుంటుంది. అయినా ఇప్పుడు మా దృష్టి అంతా రానున్న టీ20 ప్రపంచకప్‌పైనే ఉంది. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత మా గేమ్‌ ఫోకస్‌ను దానిపైనే పెట్టనున్నాం. అందుకే అన్ని రకాల ప్రయోగాలకు సిద్ధమవుతున్నాం.

రాహుల్‌ను పక్కనపెట్టినట్లు కాదు..

రాహుల్‌ను పక్కనపెట్టినట్లు కాదు..

కోహ్లీ ఓపెనర్‌గా వచ్చినంత మాత్రానా టీ20ల్లో కేఎల్ రాహుల్‌ను పక్కనపెట్టినట్లు కాదు. టీ20 ప్రపంచకప్ బ్యాటింగ్ లైనప్ గురించి ఇప్పుడే మాట్లాడటం భావ్యం కాదు. జట్టుకు కావాల్సిన సెటప్ గురించి విశ్లేషిస్తున్నాం. దానిలో భాగంగానే ఈ రోజు టాక్టికల్ మూవ్ చేశాడు. ఎక్స్‌ట్రా బౌలర్‌ను తీసుకునేందుకు ఓ బ్యాట్స్‌మెన్‌ను పక్కనపెట్టాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తు కేఎల్ రాహుల్ తప్పుకోవాల్సి వచ్చింది.

లిమిటెడ్ ఫార్మాట్‌లో కేఎల్ రాహుల్ కీలక ప్లేయర్. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ ఆధారంగానే టీమ్‌మేనేజ్‌మెంట్ బెస్ట్ ఎలెవన్‌ను ఎంపిక చేసింది. అంత మాత్రానా రాహుల్‌ను పక్కనపెట్టినట్లు కాదు. ప్రపంచకప్ సమీపించేకొద్ది పరిస్థితులు మారొచ్చు. రాహుల్ సామర్థ్యం, అతను జట్టుకు అందించిన విజయాలను మేం అర్థం చేసుకోగలం.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, March 21, 2021, 13:25 [IST]
Other articles published on Mar 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+