Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 WC 2024: కోహ్లీ వల్లే ఈ విజయం: రోహిత్ శర్మ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసాధారణ ప్రదర్శనతోనే విజయం సాధించామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లీ తన అనుభవాన్ని ఉపయోగించి ఆడాడని కొనియాడాడు. శనివారం హోరాహోరీగా సాగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో సమష్టిగా రాణించిన టీమిండియా 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. ఈ గెలుపుతో రెండోసారి టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్‌, హార్దిక్ పాండ్యాలపై ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ, అక్షర్ పటేల్ బ్యాటింగ్‌లో సత్తా చాటితే బుమ్రా, హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రాణించారని కొనియాడాడు. ఈ విజయాన్ని గత 3-4 ఏళ్లుగా తాము పడుతున్న కష్టానికి దక్కిన ఫలితంగా రోహిత్ శర్మ అభివర్ణించాడు.

Rohit Sharma say

గత నాలుగేళ్లలో తమ జట్టు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొందని, తీవ్ర ఒత్తిడితో కూడుకున్న ఎన్నో మ్యాచ్‌లు ఆడిందని చెప్పాడు. కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు కూడా ఎదురయ్యాయని గుర్తు చేసుకున్నాడు. తాజా టోర్నీలో సమష్టిగా రాణించి విజయం సాధించామని చెప్పాడు.

ఈ విజయం వెనుక టీమ్‌మేనేజ్‌మెంట్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ కష్టం ఎంతో ఉందని రోహిత్ తెలిపాడు. ఈ టోర్నీలో అసాధారణ ప్రదర్శన కనబర్చామని, తమ ఆటగాళ్ల ఆటతీరు పట్ల గర్వంగా ఉందన్నాడు.

'విరాట్ కోహ్లీ ఫామ్‌పై నాతో పాటు జట్టులోని ఏ ఒక్కరికి సందేహం లేదు. అతని క్వాలిటీ స్కిల్స్ గురించి మాకు బాగా తెలుసు. గత 15 ఏళ్లుగా అతను టాప్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఇలాంటి పెద్ద మ్యాచ్‌ల్లో పెద్ద ప్లేయర్లు జట్టు కోసం నిలబడుతారు. ఓవైపు నిదానంగా ఆడుతూ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ మాకు చాలా కీలకమైంది.

ఇవి దూకుడు ఆడే పిచ్‌లు కాకపోవడంతో ఎవరో ఒక్కరు మ్యాచ్ అసాంతం క్రీజులో ఉండాలని మేం భావించాం. వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్వేచ్చగా ఆడే పరిస్థితిని కోల్పోయాం. దాంతో ఒకరు ఆచితూచి ఆడాలనుకున్నాం. ఆ బాధ్యతను కోహ్లీకి అప్ప జెప్పాం. అతను తన అనుభవాన్ని ఉపయోగించి సమర్థవంతంగా తన బాధ్యతను నిర్వర్తించాడు. అతని అండతో ఇతర ఆటగాళ్లు చెలరేగారు.

ముఖ్యంగా అక్షర్ పటేల్ చేసిన 47 పరుగులు మాకు చాలా కీలకమయ్యాయి. బుమ్రా, హార్దిక్ పాండ్యా సైతం జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరి ఓవర్‌ను హార్దిక్ పాండ్యా అద్భుతంగా వేసాడు. ఈ రోజు మేం సాధించిన విజయానికి, మా జట్టు ఆటతీరుకు గర్వపడుతున్నా. కోట్ల మంది భారతీయులకు ఈ విజయం సంతోషాన్నిచ్చిందని భావిస్తున్నా'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, June 30, 2024, 3:33 [IST]
Other articles published on Jun 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+