Rohit Sharma: భయపడాల్సిందేం లేదు.. బాగానే ఉన్నాడు!
World cup 2023: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ వరల్డ్ కప్: హార్దిక్ పాండ్యా గాయం గురించి భయపడాల్సిన అవసరం లేదని, అతనికి అంత పెద్ద గాయం ఏం కాలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే.
బ్యాటర్ ఆడిన బంతిని ఆపే క్రమంలో హార్దిక్ ఎడమ మడమకు గాయమైంది. స్కాన్ కోసం అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు బీసీసీఐ కూడా ప్రకటించింది.

ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్లతో గెలుపొందగా.. విజయానంతరం రోహిత్ శర్మ హార్దిక్ గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు. 'హార్దిక్ కాస్త నొప్పితో బాధపడుతున్నాడు. అందరూ భయపడినంత పెద్ద గాయం ఏం కాలేదు. అది టీమిండియాకు శుభ సూచకం. కానీ ఈ గాయం నేపథ్యంలో తదుపరి మ్యాచ్‌కు అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.'అని రోహిత్ శర్మ తెలిపాడు.
ఈ విజయంపై స్పందిస్తూ.. 'ఇదో అద్భుత విజయం. ఈ తరహా విజయాలు కొనసాగించడంపై మేం ఫోకస్ పెట్టాం. ఈ మ్యాచ్‌ను మేం గొప్పగా ప్రారంభించలేదు. కానీ మిడిల్ ఓవర్లలో మా బౌలర్లు సత్తా చాటి వికెట్లు తీసారు. మా ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. మా కంట్రోల్‌లోనే ఉండే ఫీల్డింగ్‌తో ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చాం.
ఈ పిచ్‌కు తగిన సరైన లైన్ లెంగ్త్‌లను బౌలర్లు త్వరగానే పసిగట్టారు. జడేజా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. కానీ సెంచరీ సెంచరీనే. ఎంత బౌలింగ్ చేసినా.. సెంచరీని బీట్ చేయలేం.
ప్రతీ మ్యాచ్‌లో అద్భుత ఫీల్డింగ్ కనబర్చిన ప్లేయర్‌కు అవార్డు ఇస్తున్నాం. ఆటగాళ్లకు అదో స్పెషల్ మూమెంట్‌గా ఉంటుంది. ప్రతీ మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. మాకు మద్దతుగా నిలుస్తున్నారు. వారిని మరింత ఉత్సాహపరిచే విజయాలను అందుకుంటాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications