Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: అందుకే బ్యాటింగ్ తీసుకోవాలనుకున్నా: రోహిత్ శర్మ

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి బాగుంది. ఇక్కడ లో-బౌన్స్ ఉంటుందని చెప్పారు. వర్షం వచ్చే పరిస్థితులు ఉండటంతో ముందుగా బౌలింగ్ చేయడం అడ్వాంటేజ్‌గా ఉంటుందని భావించాం. మేం గొప్ప టీమ్‌తో తలపడుతున్నాం. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మేం అద్భుత ప్రదర్శన కనబర్చాం.

Rohit Sharma says The pitch tends to get slower as the game goes on during IND vs ENG semi final

అదే విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగిస్తున్నాం. టాప్ టీమ్ అయిన టీమిండియా సవాల్‌ను స్వీకరించేందుకు రెడీగా ఉన్నాం. సెమీఫైనల్ ఆడటం ఉత్సాహంగా ఉంది. అయితే మా జట్టులో చాలా మందికి నాకౌట్ ఆడిన మ్యాచ్‌ల అనుభవం ఉంది.'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిచినా తాము ముందుగా బ్యాటింగ్ చేసేవాళ్లమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. 'ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ప్రస్తుతం వాతావరణం బాగుంది. గతంలో జరిగింది గతమే(టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్ ఫలితం గురించి). ఈ మ్యాచ్‌లో మేం భారీ లక్ష్యాన్ని నమోదు చేయాలనుకుంటున్నాం. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్ స్లోగా మారే అవకాశం ఉంది.

ఇలాంటి టోర్నీల్లో ఎదురయ్యే సవాళ్లను మేం అర్థం చేసుకోగలం. మంచి క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాం. మేం ఎక్కవగా ఆలోచించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉంటూ.. విజయం కోసం ప్రయత్నించాలనుకుంటున్నాం. తుది జట్టులో ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతున్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా

ఇంగ్లండ్: జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరణ్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్, రీస్ టోప్లీ.

Story first published: Thursday, June 27, 2024, 21:12 [IST]
Other articles published on Jun 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+