Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కష్టపడ్డాం.. పరుగులు చేశాం.. వికెట్లు తీసాం.. విజయం సాధించాం: రోహిత్ శర్మ

Rohit Sharma says ‘Test cricket is hard fought cricket and isn’t easy’

అహ్మదాబాద్: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకోవడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్ కోసం తమ ఆటగాళ్లు తీవ్రంగా కష్టపడ్డారని చెప్పిన రోహిత్.. కఠిన పరిస్థితుల్లో పరుగులు చేయడంతో పాటు వికెట్లు తీసి విజయాన్నందుకున్నామని తెలిపాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టెస్ట్ డ్రాగా ముగియడంతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ 2-1తో టీమిండియా వశమైంది. టీమిండియాకు ఇది వరుసగా నాలుగో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజయం కావడం గమనార్హం. 2017, 2018-19, 2020-21, 2023 సిరీస్‌లను భారత్ వరుసగా గెలుచుకుంది. ఇక సిరీస్ విజయానంతరం మాట్లాడిన రోహిత్.. సమష్టిగా రాణించి ఆశించిన ఫలితాన్ని అందుకున్నామని తెలిపాడు.

 బీజీటీ అంటేనే..

బీజీటీ అంటేనే..

'ఇదో అద్భుతమైన సిరీస్. ఈ సిరీస్ పేరు నుంచి ప్రత్యర్థి వరకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఈ సిరీస్‌ను తొలిసారి ఆడుతున్నారు. ఈ సిరీస్ యొక్క ప్రాముఖ్యతను మేం అర్థం చేసుకున్నాం. విజయం కోసం చాలా కష్టపడ్డాం. కఠినమైన పరిస్థితుల్లోనూ ఫలితాలను రాబట్టాం. ఈ సిరీస్‌లో ఎదురైన సవాళ్లకు ధీటుగా బదులిచ్చాం. ఈ సిరీస్‌లో శుభారంభం చేయడం ఎంత ముఖ్యమో మాకు బాగా తెలుసు. ముఖ్యంగా ఢిల్లీ టెస్ట్‌లోని మా ప్రదర్శన ఎంతో గర్వకారణం. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో కఠిన పరిస్థితుల నుంచి పుంజుకొని విజయం సాధించాం. ఇండోర్ టెస్ట్‌లో మాత్రం విజయం సాధించలేకపోయాం. తీవ్ర ఒత్తిడికి గురై మ్యాచ్ చేజార్చుకున్నాం.

 ఆశించిన ఫలితం..

ఆశించిన ఫలితం..

జట్టులోని ఆటగాళ్లంతా సత్తా చాటారు. తమ బాధ్యతలను స్వీకరించి జట్టుకు కావాల్సిన ఫలితాన్ని అందించారు. టెస్ట్ క్రికెట్ చాలా కష్టమైన ఫార్మాట్. ఈ సంప్రదాయక ఫార్మాట్‌లో రాణించడం అంత సులువైన పని కాదు. ఈ విజయంతో నేను సంతృప్తిగా ఉన్నాను. వ్యక్తిగతంగా నాకోసం నేను బెంచ్ మార్క్ సెట్ చేసుకున్నాను. వ్యక్తిగత మైలురాళ్లను పక్కన పెట్టేసాను. ఈ సిరీస్‌లో నేను ఆశించిన ఫలితం దక్కింది. ఈ విజయం మాకు చాలా సంతోషాన్నిస్తుంది.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

 ఫలితం తేలకపోవడంతో..

ఫలితం తేలకపోవడంతో..

ఓవర్‌నైట్ స్కోరు 3/0‌తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా...175/2 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. భారత్‌పై 84 పరుగుల ఆధిక్యం సాధించింది. నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన మాథ్యూ కుహ్నేమన్ 6 పరుగులు చేసి ఔటవ్వగా.. ట్రావిస్ హెడ్ (163 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 90) అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన మార్నస్ లబుషేన్( 213 బంతుల్లో 7 ఫోర్లతో 63 నాటౌట్) ఎట్టకేలకు హాఫ్ సెంచరీ సాధించాడు. స్టీవ్ స్మిత్ (59 బంతుల్లో 2 ఫోర్లతో 10 నాటౌట్) అజేయంగా నిలిచాడు. మ్యాచ్ ఫలితం తేలే పరిస్థితులు లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.

 కోహ్లీ, గిల్ సెంచరీ..

కోహ్లీ, గిల్ సెంచరీ..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 480 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (180), కామెరూన్ గ్రీన్ (114) సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ( 186), శుభ్‌మన్ గిల్(128) సెంచరీలు నమోదు చేశారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇదే తొలి డ్రా. కెరీర్‌లో 6 టెస్ట్‌ మ్యాచ్‌లకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహారించాడు. తొలి నాలుగు టెస్టుల్లో విజయాలు అందుకున్న రోహిత్.. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో తొలి పరాజయాన్ని చవి చూశాడు.

Story first published: Monday, March 13, 2023, 16:59 [IST]
Other articles published on Mar 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+