వన్డేల పనైపోయిందనడం బేకార్ ముచ్చట: రోహిత్ శర్మ

ముంబై: టీ20లకు ఆదరణ పెరగడంతో వన్డే క్రికెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడిందనుకోవడం హాస్యాస్పదమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇటీవల అంతర్జాతీయ వన్డేలకు గుడ్ బై చెప్పడం ఈ ఫార్మాట్ మనుగడపై చర్చకు దారి తీసింది. టీ20లు రాజ్యమేలుతున్న ఈ కాలంలో వన్డేలకు ఆదరణ లభించడంలేదని మాజీ క్రికెటర్లు వాదిస్తున్నారు. అందుకే ఈ ఫార్మాట్‌లో మార్పులు చేయాలని సూచిస్తున్నారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదితో పాటు టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి వన్డే ఫార్మాట్‌ను 40 ఓవర్లకు కుదించాలని సూచించగా.. మరికొందరు మాత్రం వన్డే మ్యాచ్‌ల సంఖ్యను తగ్గించాలని సలహా ఇస్తున్నారు.

బేకార్ వాదన..
వన్డే క్రికెట్ మనుగడపై జరుగుతున్న చర్చపై స్పందించిన రోహిత్.. ఇదో బేకార్ చర్చని పేర్కొన్నాడు. వన్డే క్రికెట్ వల్లే తనకు ఇంత పేరొచ్చిందని అభిప్రాయపడ్డాడు. 'వన్డే క్రికెట్‌తోనే నేను ఇంత పేరు సంపాదించా. ఈ ఫార్మాట్ పనైపోయిందనడం అంతా బేకార్ ముచ్చట. గతంలో టెస్ట్ క్రికెట్ గురించి ఇలానే మాట్లాడారు. నా వరకు ఫార్మాట్ కాదు క్రికెట్టే ముఖ్యం. వన్డే క్రికెట్ పనైపోతుందని, టీ20లు ముగిసిపోతాయని, టెస్ట్‌లకు కాలం చెల్లిందని నేను అస్సలు చెప్పను. అవసరం అయితే ఇంకో ఫార్మాట్ కూడా ఉండాలని కోరుకుంటా. నాకు క్రికెట్ ఆడటమే ముఖ్యమైన విషయం. ఏ ఫార్మాట్ ఆడాలి. ఏది ఆడకూడదనేది వ్యక్తుల ఇష్టం. నా వరకైతే మూడు ఫార్మాట్లూ ముఖ్యమే'అని రోహిత్ స్పష్టం చేశాడు.

జట్టులో మార్పు వచ్చింది..
ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడటంపై స్పందించిన రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'దుబాయ్ వేదికగా గతేడాది పాకిస్థాన్‌తో ఆడాం. కానీ మాకు ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే ప్రస్తుతం జట్టులో చాలా మార్పులు వచ్చాయి. మా సన్నాహకాలు భిన్నంగా ఉన్నాయి. అప్పటికీ ఇప్పటికీ మా అప్రోచ్ వేరేలా ఉంది. అయితే మేం మైదాన పరిస్థితులను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆడాల్సి ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని దానికి తగ్గట్లు సన్నదమవుతున్నాం.

మా అప్రోచ్ మారింది..
ఆసియాకప్‌లో టీమ్‌గా రాణించడంపైనే మేం ఫోకస్ పెట్టాం. అది పాకిస్థాన్ అయినా శ్రీలంక, బంగ్లాదేశ్ అయినా మా అప్రోచ్ ఒకేలా ఉంటుంది. టీ20 ప్రపంచకప్‌కు ఇంకా రెండున్నర నెలల సమయం ఉంది. ఈ మెగా టోర్నీకి ముందు మేం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో సొంతగడ్డపై సిరీస్‌లు ఆడనున్నాం.
పరిస్థితులకు తగ్గట్లు జట్టులో మూడు, నాలుగు మార్పులు చేయాల్సి ఉంటుంది. భారత్, యూఏఈ ఆడాల్సి వస్తే ఆ పరిస్థితులకు తగిన ఆటగాళ్లు.. ఆసీస్ కండిషన్స్‌కు తగిన ప్లేయర్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications