కనికరం లేకుండా చెలరేగడమే మా స్టైల్.. ఓవర్ కాన్పిడెన్స్ అంటే ఒప్పుకోం: రోహిత్ శర్మ

అహ్మదాబాద్: ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌లో టీమిండియా ఓటమికి ఆటగాళ్ల ఓవర్ కాన్ఫిడెన్సే కారణమని మాజీ క్రికెటర్లు చేసిన విమర్శలపై రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. ఇదంతా చెత్త వాగుడని మండిపడ్డాడు. తొలి రెండు టెస్ట్‌లు గెలిచిన తర్వాత కూడా ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నాడు.
కనికరం లేకుండా ప్రత్యర్థిపై చెలరేగడమే తమ ఆటగాళ్ల ఉద్దేశమని, అది వారికి అతి విశ్వాసంలా కనిపిస్తే తాము ఏం చేయలేమని చెప్పుకొచ్చాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి రెండు టెస్ట్‌లు గెలిచిన టీమిండియా.. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో మాత్రం విఫలమైంది. టర్నింగ్ ట్రాక్‌పై భారత బ్యాటర్లు చెతులెత్తేయడంతో ఓటమికి తల వంచింది.

చెత్త వాగుడే..
అయితే తొలి రెండు టెస్ట్‌లు గెలవడంతో భారత ఆటగాళ్లకు విజయ గర్వం తలకెక్కిందని, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగి మూల్యం చెల్లించుకున్నారని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు విమర్శించారు. ఇక అహ్మదాబాద్ వేదికగా గురువారం నుంచి చివరి టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ శర్మ బుధవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి ప్రస్తావించగా.. ఘాటుగా బదులిచ్చాడు. 'తొలి రెండు టెస్ట్ గెలిచిన తర్వాత కూడా ఆటగాళ్లు అతి విశ్వాసంతో ఉన్నారనే చర్చ చెత్త వాగుడే.

దూకుడు ఆడితే..
ప్రతర్థి అంటే కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా ఆడాలని ప్రతీ క్రికెటర్ అనుకుంటాడు. ప్రత్యర్థి జట్టుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వద్దనే ఆలోచనతో ఆడుతారు. మేం కూడా అదే మైండ్‌సెట్‌తో ఆడుతున్నాం. ఇది బయటి వారికి అతివిశ్వాసంలా కనిపిస్తే మేం చేయలేం. ఆఖరి టెస్ట్‌కు ఇరు దేశాల ప్రధానులు వస్తున్నారు. వారి సమక్షంలో మ్యాచ్ ఆడాల్సి రావడం చాలా ఉత్సాహంగా ఉంది. ఆటగాళ్లకు మ్యాచ్ గెలవడమే ముఖ్యం.

పరిస్థితులతో సంబంధం లేకుండా..
ఎలాంటి పిచ్‌లోనైనా.. ప్రతికూల పరిస్థితుల్లోనైనా పరుగులు చేసే మార్గాలను కనుక్కొని ఆడాలి. టెస్ట్ మ్యాచ్‌లో కండిషన్స్‌ను పట్టించుకోకుండా పరుగులు చేయడానికి మార్గాలు కనుక్కొవాలని మా ఆటగాళ్లకు చెప్పాను. గత మ్యాచ్‌లో మేం సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడంతోనే విజయం సాధించలేకపోయాం. నేను బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రత్యర్థిపై పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తాను. నాగ్‌పూర్ టెస్ట్‌లో నేను ఆడిన ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఎలా చేస్తాను అనేదానికి ఉదహారణ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications