
పుజారాకు చెప్పాల్సిన పని లేదు..
'దాదాపుగా 80 టెస్టులు ఆడిన క్రికెటర్ గురించి మీరు అడుగుతున్నారు. మ్యాచ్‌కు ముందు అతనికి ఎలాంటి వీడియోలు చూపించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు తప్పిదాలు చెప్పేందుకు చూపించాల్సి వచ్చినా.. మ్యాచ్ జరుగుతుండగా... నువ్వెలాంటి బ్యాటర్‌వో, నువ్వేం చేయాలో వంటి వివరాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. తాజా ఇన్నింగ్స్‌లో కచ్చితంగా పరుగులు చేయాలన్న సానుకూల ఉద్దేశంతోనే పుజారా బరిలోకి దిగాడు. ఐతే కేవలం మేం మనుగడ కోసమే ఆడటం లేదు. భారీ స్కోరు చేయాలని భావిస్తున్నాం. పుజారా దాన్నే చాటిచెప్పాడు. చెత్త బంతుల్ని వదిలేయనని అతను ఆడి చూపించాడు. కొన్నాళ్లుగా అతను పరుగులు చేయలేదన్నది నిజం. అంతమాత్రాన అతనిలో నాణ్యత తగ్గిందని అనుకోవద్దు. 300+ పరుగుల లోటుతో ఉన్న పరిస్థితుల్లో ఆడటం అంత సులభం కాదని అందరికీ తెలుసు' అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

పుజారా జోరు కొనసాగాలి..
'వ్యక్తిగతంగా చూస్తే పుజారా అదరగొట్టాడు. జట్టు పరంగా అతనింకా చేయాల్సి చాలానే ఉంది. చివరి రెండు రోజులు మేం బాగా ఆడాలి. ఎప్పటిలాగే అతను సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలి. నిజానికి పుజారా గురించి మేమేం మాట్లాడుకోలేదు. బయట నుంచే విమర్శలు వస్తున్నాయి. కానీ అతడు రెండో టెస్టులో అజింక్యా రహానేతో కలిసి కీలక భాగస్వామ్యం అందించాడు. ఇక ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక సిరీస్ విజయంలో అతని పాత్ర మర్చిపోవద్దు. కొన్నిసార్లు మనం స్వల్పకాల విషయాలే గుర్తు పెట్టుకుంటాం. ఏళ్ల తరబడి అతనేం చేశాడో మర్చిపోతుంటాం' అని రోహిత్ పేర్కొన్నాడు.

చెత్త బ్యాటింగ్‌తోనే..
ఫస్ట్ ఇన్నింగ్స్ దారుణ ప్రదర్శనపై స్పందిస్తూ.. ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారన్నాడు. అయితే 78 పరుగులకే ఆలౌటవ్వాల్సిన వికెట్ అయితే అది కాదని, తమ చెత్త బ్యాటింగ్ వల్లే అలా జరిగిందని అంగీకరించాడు. ఈ తప్పిదాలను సరిదిద్దుకొని సెకండ్ ఇన్నింగ్స్‌లో రాణించామన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో విఫలమైన రోహిత్ శర్మ (156 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 59) సెకండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. క్రీజులో కుదురుకున్న రోహిత్.. అంపైర్స్ కాల్‌కు బలైపోయాడు. ఈ వికెట్‌పై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగింది. మరోసారి అంపైర్స్ కాల్ చర్చనీయాంశమైంది.

139 పరుగుల వెనుకంజలో..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా దీటుగా ఆడుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలి పరువు తీసుకున్న కోహ్లీసేన.. రెండో ఇన్నింగ్స్‌లో స్పూర్తిదాయక పోరాటం చేస్తోంది. ఓపెనర్ రోహిత్ శర్మ ( 59) రాణించగా, చతేశ్వర్ పుజారా (180 బంతుల్లో 15 ఫోర్లతో 91 బ్యాటింగ్) సెంచరీకి చేరువయ్యాడు. కెప్టెన్ కోహ్లీ (94 బంతుల్లో 6 ఫోర్లతో 45 బ్యాటింగ్) క్రీజులో పాతుకుపోయాడు. 80 ఓవర్లు అంటే దాదాపు రోజంతా (సాధారణంగా 90 ఓవర్లు) బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం రెండే వికెట్లు సమర్పించుకుంది. మూడో రోజు ఆట నిలిచే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 215 పరుగులు చేసింది. రాబిన్సన్, ఓవర్టన్‌లకు చెరో వికెట్ దక్కింది. ప్రస్తుతం భారత్ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. ఆట నాలుగో రోజు పుజారా, కోహ్లీసుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటంతోపాటు ఇతర బ్యాట్స్‌మెన్ రహానే, జడేజా, పంత్ కూడా కదంతొక్కితే ఈ మ్యాచ్‌లో భారత్ కోలుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












