కొలంబో: పేసర్ల అసాధారణ ప్రదర్శనతోనే ఈ అద్భుత విజయాన్ని అందుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఏళ్లు గడిచినా ఈ విజయం మరిచిపోలేమని చెప్పాడు. ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచి 8వ సారి టైటిల్ అందుకుంది. ఈ విజయానంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. సమష్టి ప్రదర్శనతోనే ఈ విజయం సాధ్యమైందన్నాడు.
ఇదే జోరులో భారత్ వేదికగా జరిగే అప్‌కమింగ్ సిరీస్‌తో పాటు ప్రపంచకప్‌లోనూ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశాడు. 'ఇదో అద్భుత ప్రదర్శ. ఫైనల్లో ఈ తరహా ప్రదర్శన మానసిక బలాన్ని తెలియజేస్తోంది. బంతితో అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్నాం. బ్యాట్‌తోనూ మంచి ముగింపు ఇచ్చాం. నేను స్లిప్‌లో అలా చూస్తూ నిలబడిపోయాను..

మా పేసర్లు చాలా కష్టపడ్డారు. చాలా స్పష్టమైన ప్రణాళికలతో బౌలింగ్ చేసారు. ఈ విజయం ఏళ్లు గడిచినా మరిచిపోలేనిది. ఈ స్థాయిలో భారత పేసర్లు చెలరేగుతారని ఊహించలేదు. ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా రాణించారు. ఈ విజయం క్రెడిట్ సిరాజ్‌దే. గాలిలో బంతి మూవ్ చేసే పేసర్లు చాలా అరుదు. సిరాజ్‌కు ఆ సామర్థ్యం ఉంది.
ఈ టోర్నీలో ఓ జట్టుగా మేం చేయాల్సినవన్నీ చేశాం. భారత్ వేదికగా జరిగే అప్‌కమింగ్ సిరీస్‌తో పాటు ప్రపంచకప్‌లోనూ సత్తా చాటుతాం. పాకిస్థాన్‌తో తీవ్ర ఒత్తిడిలో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ సెంచరీలు బాదారు. గిల్ ఒంటరి పోరాటం చేశాడు. ప్రతీ ప్లేయర్ తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు.'అని చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. మహమ్మద్ సిరాజ్(6/21) సంచలన బౌలింగ్‌తో 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా(3/3), జస్‌ప్రీత్ బుమ్రా(1/23) సత్తా చాటారు. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్(17), దుషన్ హేమంత(13 నాటౌట్)లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఇషాన్ కిషన్(18 బంతుల్లో 3 ఫోర్లతో 23 నాటౌట్), శుభ్‌మన్ గిల్(19 బంతుల్లో 6 ఫోర్లతో 27 నాటౌట్) రాణించారు.