Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాతో ఓపెనింగ్ చేసేది అతనే.. టీ20 ఫార్మాట్‌ను వదిలే ప్రసక్తే లేదు: రోహిత్ శర్మ

 Rohit Sharma says Shubman Gill will open the innings in 1st ODI against Sri Lanka

గువహతి: టీ20 ఫార్మాట్‌ను వదిలే ప్రసక్తే లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నానని స్పష్టం చేశాడు. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లను టీ20లకు దూరంగా ఉంచాలని బీసీసీఐ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్లను వన్డేలకు మాత్రమే పరిమితం చేసి ప్రపంచకప్ కోసం బెస్ట్ ఎలెవన్ ఎంపిక చేయాలని ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.

టీ20లను వదిలే ముచ్చటే లేదు..

టీ20లను వదిలే ముచ్చటే లేదు..

ఈ క్రమంలోనే శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమీలను దూరంగా ఉంచింది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. మూడు ఫార్మాట్ల ప్లేయర్లకు కావాల్సినంత విశ్రాంతి ఇవ్వడం ముఖ్యమని చెప్పుకొచ్చాడు. శ్రీలంకతో మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా గువహతి వేదికగా మంగళవారం జరగనున్న తొలి వన్డే నేపథ్యంలో సోమవారం రోహిత్ మీడియాతో మాట్లాడాడు.

 రెస్ట్‌తోనే దూరం..

రెస్ట్‌తోనే దూరం..

ఈ సందర్భంగా అతని టీ20 భవిష్యత్తుపై ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానమిచ్చాడు. 'టీ20 ఫార్మాట్‌ను వదిలేయాలని నిర్ణయించుకోలేదు. ముందుగా బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్‌లు ఆడటం సాధ్యం కాదు. మూడు ఫార్మాట్ల ప్లేయర్‌కు కావాల్సినంత విశ్రాంతినివ్వాలి. నేను కూడా అలానే రెస్ట్ తీసుకున్నాను. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ ఉంది. ఐపీఎల్ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. టీ20 ఫార్మాట్‌ను వదులుకోవాలని నిర్ణయించుకోలేదు.'అని తెలిపాడు.

గాయంతో దూరం..

గాయంతో దూరం..

ఇక వన్డే సిరీస్ నుంచి జస్‌ప్రీత్ బుమ్రాను తప్పించడానికి గల కారణాన్ని కూడా రోహిత్ వెల్లడించాడు. ఎన్‌సీఏలో నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు బుమ్రా వెన్నులో పట్టేసిందని, దాంతోనే అతన్ని తప్పించాల్సి వచ్చిందని తెలిపాడు. అయితే దీని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని, చిన్న గాయమేనని స్పష్టం చేశాడు. బుమ్రానే అసౌకర్యంగా ఉన్నానని చెప్పినప్పుడు పక్కనపెట్టకుండా ఎలా ఉంటామన్నాడు. బుమ్రా చాలా కీలకమైన బౌలరని, అతని గాయాల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నాడు.

 ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్..

ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్..

శ్రీలంకతో తొలి వన్డేలో తనతో ఓపెనింగ్ చేసేది శుభ్‌మన్ గిల్ అని రోహిత్ స్పష్టం చేశాడు. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేసినా.. అతన్ని జట్టులో ఆడించే పరిస్థితి లేదన్నాడు. 'వన్డేల్లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేశాడు. డబుల్ సెంచరీ చేయడం ఎంత గొప్ప నాకు బాగా తెలుసు. కానీ దురదృష్టవశాత్తు ఇషాన్ కిషన్‌ను ఆడించలేని పరిస్థితి. శుభ్‌మన్ గిల్‌కు వరుస అవకాశాలు ఇవ్వడం న్యాయమే. ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ వన్డేల్లో సత్తా చాటాడు. ఇషాన్ కిషన్ కూడా రాణించినప్పటికీ దురదృష్టవశాత్తు అతన్ని జట్టులోకి తీసుకునే పరిస్థితి లేదు'అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.

Story first published: Monday, January 9, 2023, 19:14 [IST]
Other articles published on Jan 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+