టీమిండియా ఫ్యూచర్ స్టార్ అతనే: రోహిత్ శర్మ

ముంబై: యువ క్రికెటర్ శుభమన్ గిల్ టీమిండియా ఫ్యూచర్ స్టార్ అని పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న శుభమన్ గిల్‌కు గతేడాది నుంచి భారత్ జట్టుకు ఎంపికవుతున్నా తుది జట్టులో మాత్రం అవకాశం లభించడం లేదు.అయితే.. శుభమన్ గిల్ నిలకడ సాధించగలిగితే గొప్ప క్రికెటర్ అవుతాడని రోహిత్ శర్మ కితాబిచ్చాడు.
గురువారం హర్భజన్ సింగ్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న హిట్‌మ్యాన్.. శుభమన్ గిల్ గురించి ప్రస్తావించగా ఈ విధంగా చెప్పుకొచ్చాడు. 'శుభమన్ గిల్‌కు మంచి బ్యాటింగ్ నైపుణ్యం ఉంది. అతను టీమిండియా ఫ్యూచర్ స్టార్. బ్యాటింగ్‌లో గిల్ నిలకడ సాధించగలిగితే.. అతని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేశవాళీ క్రికెట్‌లో అతనికి మెరుగైన రికార్డులు ఉన్నాయి. నా అంచనా ప్రకారం త్వరలోనే అతనికి మళ్లీ భారత్ జట్టులో అవకాశం దక్కుతుంది' రోహిత్ చెప్పుకొచ్చాడు.
వాస్తవానికి గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనే శుభమన్ గిల్‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా రోహిత్ శర్మ ఓపెనర్‌గా ఆడటం.. సెంచరీ సాధించడంతో మళ్లీ గిల్‌కు ఆడే అవకాశం లభించలేదు. అయితే.. ఈ యువ క్రికెటర్ మాత్రం భారత్-ఎ జట్టు, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు.

ఇక అంతకు ముందు భజ్జీ మాట్లాడుతూ.. శుభ్‌మన్ గిల్‌కు మరిన్ని అవకాశాలివ్వాలని అభిప్రాయపడ్డాడు. 'పృథ్వీ షాను జట్టులోకి తీసుకోవడం బాగుంది. కానీ నీవు (రోహిత్) లేని సమయంలో శుభ్‌మన్‌ను జట్టులోకి తీసుకోవడం బాలేదు. ఇది అతనికి కూడా మంచిది కాదు. శుభ్‌మన్ ఫ్యూచర్ స్టార్ అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి'అని భజ్జీ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలతో రోహిత్ కూడా ఏకీభవించాడు.
ఇక ఈ లైవ్ సెషన్‌లోనే ఈ ఇద్దరు క్రికెటర్లు ధోనీ భవితవ్యంపై కూడా చర్చించారు. ధోనీ భవిష్యత్తు ప్రణాళికల ఏంటని అభిమానుల నుంచి వచ్చిన ప్రశ్నలకు రోహిత్ వ్యంగ్యంగా స్పందించాడు. తనకేం తెలియదని, ఆ విషయంలో రాంచీలో ఉన్న అతన్నే అడగాలన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications