ఆ నలుగురు అదరగొట్టారు.. అతనైతే టీమ్‌కు కంప్లీట్ ప్యాకేజ్: రోహిత్ శర్మ

బెంగళూరు: శ్రీలంకతో టెస్ట్ సిరీస్ గెలవడం పట్ల చాలా సంతోషంగా ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ సిరీస్‌లో టీమ్‌గా తమ లక్ష్యాలను అందుకున్నామని చెప్పాడు. బెంగళూరు వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా 238 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. దాంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయానంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్‌లపై ప్రశంసల జల్లు కురిపించాడు. భవిష్యత్తులో జట్టు విజయాల్లో ఈ నలుగురు కీలకం అవుతారని చెప్పాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ ఆల్‌టైమ్ గ్రేట్ అనేది తన వ్యక్తిగత అభిప్రాయమని, ఇతరుల వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులు రావడం ప్రత్యేక అనుభూతిని కలిగించిందన్నాడు.

జడేజా కంప్లీట్ ప్యాకెజ్..
'ఈ విజయం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని వ్యక్తిగతంగా టీమ్‌గా ఆస్వాదిస్తున్నాను. జట్టుగా మేం కొన్ని విషయాల్లో మా లక్ష్యాలను అందుకున్నాం. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆటగాడిగా జడేజా ఎదుగుదలను చూశాం. అతను రోజు రోజుకు మరింత మెరుగువుతున్నాడు. అతను టీమ్‌కు బలంగా మారాడు. బౌలింగ్‌లో కూడా చాలా మెరుగయ్యాడు. అతను గన్ ఫీల్డర్ కూడా. అతను టీమ్‌కు కావాల్సిన కంప్లీట్ ప్యాకెజ్.
శ్రీలకంతో టీ20 సిరీస్ ఫామ్‌నే శ్రేయస్ అయ్యర్ టెస్ట్ సిరీస్‌లోనూ కొనసాగించాడు.

శ్రేయస్‌కు తెలుసు..
అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా వంటి స్టార్ బ్యాట్స్‌మన్ స్థానాల్లో ఆడుతున్నాననే విషయం శ్రేయస్‌కు తెలుసు. వారి స్థానాలను భర్తీ చేయగల సామర్థ్యాలు అతనిలో ఉన్నాయి. కెరీర్ ప్రారంభానికి ఇప్పటికీ అతను ఎంతో మెరుగయ్యాడు. రిషభ్ పంత్ సైతం ప్రతీమ్యాచ్‌కు బెటర్ అవుతున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌కు ప్రతికూలమైన ఇలాంటి కండీషన్స్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇలాంటి పరిస్థితుల్లో అతను రాణించడం మనం చూశాం. ఈ మ్యాచ్‌లో అతను అందుకున్న కొన్ని క్యాచ్‌లు, చేసిన స్టంపౌట్స్ గమనిస్తే అతను ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నాడనే విషయం అర్థం అవుతుంది.

క్రౌడ్‌తో క్రేజీ క్రేజీ ఫీలింగ్..
ఇక అశ్విన్ ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇతరులు ఏమనుకున్నా.. అతను నా దృష్టిలో దిగ్గజ స్పిన్నరే. అతనికి ఎప్పుడూ బాల్ ఇచ్చినా మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్‌తో అదరగొడుతున్నాడు. ఇంకా అతనికి క్రికెట్ ఆడే సమయం చాలా ఉంది. ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనలు మరెన్నో ఇస్తాడు. ఇక పింక్ బాల్ టెస్ట్ సవాల్‌తో కూడుకున్నది. పింక్ బాల్‌తో భారత్‌లో ఆడిన అనుభవం లేదు. కానీ మ్యాచ్‌కు తగ్గ అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటున్నాం. మ్యాచ్‌కు అభిమానులు రావడం ప్రత్యేక అనుభూతినిచ్చింది'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

టీమిండియా సూపర్ షో..
447 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 208 పరుగులకే కుప్పకూలింది. లంక్ కెప్టెన్ దిముత్ కరుణ రత్నే(174 బంతుల్లో 15 ఫోర్లతో 107) సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. కుశాల్ మెండీస్(60 బంతుల్లో 8 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్‌కు రెండు, రవీంద్ర జడేజాకు ఓ వికెట్ దక్కింది. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. రెండున్నర రోజుల్లో గులాబీ టెస్ట్ ముగియడం విశేషం. ఇక సొంతగడ్డపై భారత్‌కు ఇది వరుసగా 15వ టెస్ట్ సిరీస్ విజయం కావడం గమనార్హం.
భారత్ తొలి ఇన్నింగ్స్ 252 ఆలౌట్ (శ్రేయస్ అయ్యర్ 92)
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 109 ఆలౌట్ ( మాథ్యూస్ 43, బుమ్రా 5/24)
భారత్ రెండో ఇన్నింగ్స్ 303/9 డిక్లెర్డ్ (రిషభ్ పంత్ 50, శ్రేయస్ అయ్యర్ 67)
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 208 ఆలౌట్( దిముత్ కరుణ రత్నే 107, కుశాల్ మెండీస్ 54)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications