గిట్ల ఆడుతడని అస్సలు ఊహించలే.. వరుస ఓటములు నా నుంచి ఐతలేదు: రోహిత్ శర్మ

పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో తమ హ్యాట్రిక్ పరాజయాల పట్ల ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. సునాయసంగా గెలిచే మ్యాచ్‌లను సైతం అనవసర తప్పిదాలతో చేజార్చుకోవడం బాధగా ఉందన్నాడు. ప్రణాళికలకు తగట్లు రాణించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా ఓడిపోయిన కెప్టెన్‌గా మళ్లీ మళ్లీ మాట్లాడాల్సి రావడం చాలా కష్టంగా ఉందని చెప్పాడు. కోల్‌కతానైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. లీగ్‌లో ముంబైకి ఇది వరుసగా మూడో పరాజయం. అయితే ఈ మ్యాచ్‌లో 15వ ఓవర్ వరకు మ్యాచ్‌పై పట్టు సాధించిన ముంబై.. ప్యాట్ కమిన్స్ (14 బంతుల్లో హాఫ్ సెంచరీ) మెరుపు ఇన్నింగ్స్‌తో ఓటమిపాలైంది.

క్రెడిట్ కమిన్స్‌దే
మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. ప్యాట్ కమిన్స్ ఇలా చెలరేగుతాడని అస్సలు ఊహించలేదన్నాడు. 'కమిన్స్ ఇలా ఆడుతాడని అస్సలు అనుకోలేదు. ఈ విజయం క్రెడిట్ అతనొక్కడిదే. మ్యాచ్ సాగుతున్నా కొద్ది పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. కానీ ఆరంభంలో మాత్రం ప్రతికూలంగా ఉంది. బంతి ఆగుతూ వచ్చింది. మొత్తానికి మంచి వికెటే. బ్యాటింగ్‌లో మేం సరైన ఆరంభాన్ని అందుకోలేకపోయాం. ఇక చివరి 4-5 ఓవర్లలో 70 ప్లస్ రన్స్ చేయడం గొప్ప విషయమే అని చెప్పాలి.

ఒక్క వికెట్ తీసినా..
ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాం. 15వ ఓవర్ వరకు మేం గెలుపు రేసులో ఉన్నాం. కానీ కమిన్స్ అద్భుత ఇన్నింగ్స్‌తో మా విజయవకాశాలను దెబ్బతీసాడు. స్కోర్ బోర్డుపై ఇంకొన్ని పరుగులు ఉండి ఉంటే మాదే పై చేయి అయ్యేది. ఎందుకంటే అప్పటికే మేం ఐదు వికెట్లు తీసాం. వెంకటేశ్, కమిన్స్‌ల్లో ఒక్కరిని ఔట్ చేసినా మాకు విన్నింగ్ చాన్స్ ఉండేది. కొన్ని ఓవర్లలో మారిన పరిస్థితులతో ఎదురైన ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా. మేం చాలా హార్డ్ వర్క్ చేయాలి. ప్రతీసారి ఇలా ఓడిన కెప్టెన్‌గా వచ్చి మాట్లాడటం చికాకుగా ఉంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

4 ఫోర్లు, 6 సిక్స్‌లతో...
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ ( 36 బంతుల్లో 5 ఫోర్లు, 2
సిక్స్‌లతో 52) అర్ధశతకంతో సత్తాచాటాడు. తిలక్ వర్మ ( 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్), పొలార్డ్ ( 5 బంతుల్లో 3 సిక్స్‌లతో 22 నాటౌట్) రాణించారు. కమిన్స్ (2/49) రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో కోల్‌కతా 5 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. కమిన్స్ ( 15 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56 నాటౌట్) వీరవిహారం చేశాడు. వెంకటేశ్ అయ్యర్ ( 41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మురుగన్ అశ్విన్ (2/25), మిల్స్ (2/38) ఆకట్టుకున్నారు.

ఒకే ఓవర్లో 35 పరుగులు...
కోల్‌కతా విజయానికి చివరి అయిదు ఓవర్లలో 35 పరుగులు కావాలి.. మ్యాచ్ మరో మూడు ఓవర్లయినా సాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ కమిన్స్ ఆ అవకాశమే ఇవ్వలేదు. ఒక్క ఓవర్లోనే కథ ముగించాడు. సామ్స్ (1/50) బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6, 6 కొట్టిన అతను.. ఆ తర్వాత చివరి రెండు బంతులను 4, 6గా మలచి 16వ ఓవర్లోనే జట్టుకు విజయాన్ని అందించాడు. బంతి ఎలా, ఎక్కడ పడ్డా దానికి బౌండరీ దారే చూపించాడు. మధ్యలో ఓ బంతిని బౌండరీ దగ్గర సిక్సర్ వెళ్లకుండా సూర్య అద్భుతంగా అందుకున్నప్పటికీ అది నోబాల్‌గా తేలింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications