
నా బ్యాటింగ్ వైఫల్యం...
'బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్, బలమైన ప్రత్యర్థి వంటి భిన్న పరిస్థితులున్నా.. ఇద్దరు ఓవర్‌సీస్ ప్లేయర్లతో బరిలోకి దిగడం సరైన నిర్ణయమని మేం భావించాం. వాస్తవానికి మేం బ్యాటింగ్ విభాగాన్ని పటిష్టపరచాలనుకున్నాం. దురదృష్టవశాత్తు కొంతమంది ఓవర్‌సీస్ ఆటగాళ్ల సేవలను కోల్పోయాం. దాంతో జట్టులో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లతోనే బరిలోకి దిగాం. వ్యక్తిగతంగా నా బ్యాటింగ్ వైఫల్యం కూడా జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది. ఈ మ్యాచ్‌లో నేను 26 రన్సే చేశాను. వీలైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాను. కానీ దురదృష్టవశాత్తు రాంగ్ టైమ్‌లో ఔటవుతున్నాను.

సూర్య దయవల్లే..
ఓపెనర్లుగా 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాం. కానీ రాంగ్ టైమ్‌లో ఔటవ్వడం తీవ్రని నష్టం చేసింది. ఈ వికెట్‌పై 150 పరుగుల లక్ష్యం ఏ మాత్రం సరిపోదు. సెన్సిబుల్‌గా ఆడితే చెలరేగవచ్చని సూర్య చూపించాడు. సూర్య తన బ్యాటింగ్‌తో కనీసం పోరాడే లక్ష్యాన్ని అందించాడు. ఇది ఏ మాత్రం సరిపోదనే విషయం తెలుసు. అయినా బంతితో మా విజయవకాశాలను మెరుగుపరుచుకోవాలనుకున్నాం. కానీ ఆర్‌సీబీ సెన్సిబుల్‌గా బ్యాటింగ్ చేసింది. చాలా విషయాల్లో మా బ్యాటర్లు మెరుగవ్వాలి. ఎక్కువ సేపు ఆడేలా సాధన చేయాలి. అదొక్కటే మేం వెంటనే మార్చుకోవాల్సింది.

150 రన్స్ టార్గెట్ సరిపోదు..
భారీ లక్ష్యం ఉంటే బౌలర్లకు ఏదైనా చేయడానికి వీలు ఉంటుంది. గత రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్ చేయలేకపోయాం. గత మ్యాచ్‌లో 160, ఈ మ్యాచ్‌లో 150 పరుగులు మాత్రమే చేశాం. ఇలాంటి బ్యాటింగ్ ట్రాక్‌లపై ఇవేం సరిపోవు. ఆర్‌సీబీ వంటి బలమైన ప్రత్యర్థులపై ఈ టార్గెట్స్ అస్సలు సరిపోవు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణించినప్పుడే విజయం దక్కుతుంది. అలాంటి ఒక్కటి వస్తే దాన్ని మేం కొనసాగించాల్సి ఉంటుంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

చెలరేగిన అనూజ్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 151 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 నాటౌట్).. రోహిత్ శర్మ(26), ఇషాన్ కిషన్(26) రాణించారు. 79 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ముంబైని.. జయదేవ్ ఉనాద్కత్(13 నాటౌట్)తో కలిసి సూర్య 7వ వికెట్‌కు అజేయంగా 72 పరుగులు జోడించాడు. బెంగళూరు బౌలర్లలో వానిందు హసరంగా, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ.. అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్‌తో 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 152 పరుగులు చేసి 9 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది.


Click it and Unblock the Notifications
