Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పిచ్‌ గురించి ఏడ్వడం కాదు.. ఆటపై ఫోకస్ పెట్టండి! ఆసీస్‌కు రోహిత్ శర్మ చురకలు

Rohit Sharma says Just focus on cricket and not the pitch ahead of Nagpur Test

నాగ్‌పూర్: పిచ్ గురించి ఆలోచించడం మానేసి ఆటపై ఫోకస్ చేయాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూచించాడు. ఇరు జట్లలో సత్తా కలిగిన ఆటగాళ్లు ఉన్నారని తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గురువారం నాగ్‌పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే భారత్.. తమకు అనుకూలంగా ఉండే స్పిన్ పిచ్‌లను రూపొందిస్తుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లతో పాటు అక్కడి మీడియా వరుస కథనాలను ప్రచురించింది. దాంతో చర్చంతా స్పిన్ పిచ్‌ల చుట్టూ తిరిగింది. తొలి టెస్ట్ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మను.. పిచ్ గురించి ప్రశ్నించగా తనదైన శైలిలో బదులిచ్చాడు. పిచ్‌పై కాకుండా ఆటపై ఫోకస్ పెట్టాలన్నాడు.
పిచ్‌పై ఏడ్వడం ఆపండి..

పిచ్‌పై ఏడ్వడం ఆపండి..

'పిచ్‌పై కాకుండా క్రికెట్‌పై ఫోకస్ పెట్టండి. ఇరు జట్లలోని 22 మంది క్వాలిటీ ప్లేయర్లున్నారు. స్పిన్ పిచ్‌లకు తగ్గట్లు ప్రణాళికలను సిద్దం చేసుకోని ఆడాలి. ప్రతీ ఒక్కరికి భిన్నమైన విధానం ఉంటుంది. కొందరు స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో స్పిన్‌ను ఎదుర్కొంటారు. అయితే స్ట్రైక్ రొటేట్ చేయడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మాత్రం ఎదురు దాడికి దిగాల్సి ఉంటుంది. కెప్టెన్లు విభిన్నమైన ప్రణాళికలతో ఉంటారు. ఫీల్డ్‌, బౌలింగ్‌లో మార్పులు చేస్తుంటారు. అందుకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారో వారికే విజయం దక్కుతుంది.

నాలుగు సాలిడ్ మ్యాచ్‌లు..

నాలుగు సాలిడ్ మ్యాచ్‌లు..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడానికి నాలుగు సాలిడ్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ సిరీస్ మాకు చాలెంజింగ్‌గా ఉంటుందని తెలుసు. అయితే గెలవడానికి ఏం చేయాలో, ఎలా ఆడాలో అనేదానిపై మాకు స్పష్టత ఉంది. ఏ మ్యాచ్‌కు అయిన సన్నాహకం కీలకం. బాగా ప్రిపేర్ అయితే ఆశించిన ఫలితం దక్కుతుంది. మేం గతంలో రెండు సిరీస్‌లు గెలిచాం. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలవడంపైనే ఫోకస్ పెట్టాం.

పంత్ లేకపోవడం లోటే..

పంత్ లేకపోవడం లోటే..

రిషభ్ పంత్ ఈ సిరీస్‌లో లేకపోవడం మాకు తీరని లోటే. అయితే అతని రోల్‌ను భర్తీ చేయగల ప్లేయర్లు జట్టులో ఉన్నారు. శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. భారీ సెంచరీలు చేశాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఎలా ఆడుతాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరిలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించలేదు. మ్యాచ్ రోజే తుది జట్టు ఎంపికైన నిర్ణయం తీసుకుంటాం.

తొలి రోజే 40 వేల మంది..

తొలి రోజే 40 వేల మంది..

జట్టులో ఉన్న నలుగురు స్పిన్నర్లు కూడా క్వాలిటీ స్పిన్నర్లే. అశ్విన్, జడేజా చాలా మ్యాచ్‌లు కలిసి ఆడారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అవకాశం వచ్చినప్పుడల్లా సద్వినియోగం చేసుకున్నారు. వీరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంపై మాకు క్లారిటీ ఉంది. టెస్టు క్రికెట్ టైమ్ అయిపోయిందని, సుదీర్ఘ ఫార్మాట్‌కు ఆదరణ తగ్గుతుందని చాలా మంది అంటున్నారు. అయితే నాగ్‌పూర్ టెస్టు మొదటి రోజు మ్యాచ్‌కే 40 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది టెస్టు క్రికెట్‌కి ఉన్న క్రేజ్.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, February 8, 2023, 14:42 [IST]
Other articles published on Feb 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+