Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే ఓడిపోయాం : రోహిత్ శర్మ

Rohit Sharma says It will be difficult to win games if batsmen dont perform

షార్జా: పేలవ బ్యాటింగే తమ ఓటమికి కారణమైందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. పిచ్ స్వభావం తెలిసి కూడా దానికి తగ్గట్లు ఆడలేకపోయామన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ అద్భుత విజయాన్నందుకుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన రోహిత్.. పిచ్ స్వభావం, కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి, బలమైన ప్రత్యర్థి.. అన్నీ తెలిసి కూడా చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకున్నామన్నాడు. బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చాల్సిందని అభిప్రాయపడ్డాడు. కావాల్సిన పరుగులు చేయకుండా మ్యాచ్‌ను కాపాడుకోవడం కష్టమన్నాడు.

కఠినమైన వికెట్..

కఠినమైన వికెట్..

'ఇది చాలా కఠినమైన వేదికని మాకు ముందే తెలుసు. ఇప్పటికే ఇక్కడ జరిగిన చాలా మ్యాచ్‌లను మేం చూశాం. పరుగులు చేయడానికి ఈ వికెట్ ఏమాత్రం అనువైనది కాదు. పిచ్‌కు తగ్గట్లు ఆడాలని ముందే ప్రిపేరయ్యాం. కానీ మా ప్రణాళికలను అమలు చేయలేకపోయాం. పేలవ బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకున్నాం. ఇదేం 170-180 పరుగులు చేయాల్సిన వికెట్ కాదని తెలుసు. కానీ 140 పరుగులైన చేయాలనుకున్నాం. కానీ ఆ దిశగా భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం.

బ్యాట్స్‌న్ వైఫల్యమే..

బ్యాట్స్‌న్ వైఫల్యమే..

బ్యాట్స్‌మన్ కావాల్సిన పరుగులు చేయాలకుండా.. బౌలర్లతో మ్యాచ్‌లు గెలవాలంటే అదంతా సులువైన పని కాదు. ఈ ఓటమికి బ్యాట్స్‌మన్ వైఫల్యమే కారణమని అంగీకరిస్తున్నాను. మిడిల్ ఓవర్లలో మా ప్రణాళికలకు తగ్గట్లు ఆడలేకపోయాం. ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. మా సామర్థ్యం మేరకు మేం ఆడలేదు. కనీసం వచ్చే మ్యాచ్‌ల్లోనైనా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరుస్తాం. మేం ఎలా ఆడాలో మాకు బాగా తెలుసు'అని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ అంతా దారుణంగా విఫలమయ్యారు. స్వల్ప టార్గెట్‌ను కాపాడేందుకు బౌలర్లు ప్రయత్నించినా.. శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ స్మార్ట్‌గా ఆడి ఢిల్లీకి విజయాన్నందించారు.

ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు..

ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు..

ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సన్నగిల్లాయి. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ సేన కేవలం ఐదింటిలోనే గెలుపొందింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా ముంబై ప్లే ఆఫ్స్ చేరే అవకాశం లేదు. ఎందుకంటే ఆ జట్టు రన్‌రేట్ మిగతా జట్ల కన్నా తక్కువగా ఉంది. మిగతా రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదు చేసి ఘన విజయాలు సాధిస్తేనే రన్‌రేట్ మెరుగవుతుంది. అయితే యూఏఈ పిచ్‌లపై భారీ స్కోర్లు నమోదు చేయడం అంత సులువు కాదు. దాంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై తప్పుకున్నట్లే. ప్రస్తుతం 10 పాయింట్లతో 6వ స్థానంలో ఉన్న ముంబై.. -0.453 రన్ రేట్‌తో ఉంది. పంజాబ్ కింగ్స్, కేకేఆర్, ఆర్‌సీబీ జట్ల రన్ రేట్.. ముంబై టీమ్ కన్నా మెరుగ్గా ఉంది. ఈ పరిస్థితుల్లో రోహిత్ సేన ప్లే ఆఫ్స్ చేరాలంటే అద్భుతమే జరగాలి. మిగతా జట్లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడి.. ముంబై భారీ తేడాతో గెలుపొందిదే తప్పా టోర్నీలో ముందడుగు వేసే పరిస్థితి లేదు.

అదరగొట్టిన అశ్విన్, అయ్యర్

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) మినహా అంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్‌కు తోడుగా అన్రిచ్ నోర్జ్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 136 పరుగులు చేసి మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. శ్రేయస్ అయ్యర్(33 బంతుల్లో 2 ఫోర్లతో 33 నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్(21 బంతుల్లో సిక్స్‌తో 20 నాటౌట్) క్లాస్ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్నందించారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా, జయంత్ యాదవ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నైల్ తలో వికెట్ తీసారు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన అక్షర్ పటేల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

Story first published: Saturday, October 2, 2021, 20:59 [IST]
Other articles published on Oct 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+