IPL 2022 గిట్ల ఉంటుందని ఊహించలే.. వచ్చే సీజన్‌లో మేమేంటో చూపిస్తాం: రోహిత్ శర్మ

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫైవ్ టైమ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున నిలిచింది. వరుసగా 8 మ్యాచ్‌ల్లో ఓడి అందరి కన్నా ముందే టైటిల్ రేసు నుంచి తప్పుకుంది. ఇక తమ వైఫల్యంపై స్పందించిన ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ.. ఈ సీజన్ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదన్నాడు. అయితే ఈ వైఫల్యం తమకు ఓ గుణ పాఠమని, ఎన్నో విషయాలు నేర్చుకున్నామని చెప్పాడు. ఈ సీజన్‌లో జరిగిందేదో జరిగిందని వచ్చే సీజన్‌లో తమ సత్తా ఏంటో చూపిస్తామని చెప్పాడు. తాజాగా జీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

అస్సలు ఊహించలేదు..
'ఈ సీజన్ అస్సలు ఊహించని విధంగా సాగింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ మేం చాలా విషయాలు నేర్చుకోగలిగాం. కొన్ని సానుకూలంశాలను గుర్తించాం. క్లిష్ట పరిస్థితుల్లో ఓ జట్టుగా కలిసి ఉండడం అనేది చాలా పెద్ద విషయం. అది ఈ సీజన్‌లో మేం తెలుసుకున్నాం. ఇప్పుడు మా ఫోకస్ అంతా వచ్చే సీజన్‌పైనే ఉంది. ఈ సీజన్ చివర్లో మంచి విజయాలు అందుకున్నాం. ఈ విజయాలు మా పరిస్థితిని మార్చలేకపోవచ్చు. కానీ మాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. మేం వచ్చే సీజన్‌లో మరింత బలంగా రావడానికి కావాల్సిన ఉత్సాహాన్నిచ్చాయి.

గన్ ప్లేయర్స్ కనుగొన్నాం..
టీమ్‌లో సమిష్టితత్వం నిండుగా ఉంది. ఏ జట్టుకైనా ఇది చాలా అవసరం. ఏ పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించడానికి జట్టు సిద్ధంగా లేదు. మేం ఓ కుటుంబంలా కలిసి ఉన్నాం. ట్రైయినింగ్‌లో మేం బెస్ట్ ఇచ్చాం. మా అందరి లక్ష్యం ఒక్కటే, దాని కోసం కలిసి పని చేస్తాం. ఈ సీజన్‌లో కొందరు గన్ ప్లేయర్లలో కనుగొన్నాం. వాళ్లు ఫ్యూచర్‌లో స్టార్లు అవుతారు. ఈ సీజన్‌లో వాళ్ల పర్పామెన్స్ చూసి చాలా గర్వంగా ఫీల్ అయ్యాం.

భవిష్యత్తుపై భరోసా..
ఇంత చిన్న వయసులోనే మెంటల్‌గా ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటూ, పరుగులు చేయాలనే ఆకలిని తీర్చుకుంటున్నారు... ఈ సీజన్‌లో ముంబై ఆడిన వాళ్లలో చాలా మంది కొత్తవాళ్లే, మొట్టమొదటిసారి ఐపీఎల్ ఆడుతున్నవాళ్లే. అయితే వాళ్లకి కావాల్సిన స్వేచ్ఛ, సపోర్ట్ ఇచ్చాం. వాళ్ల పర్ఫామెన్స్ సంతృప్తినిచ్చింది. భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుందన్న భరోసా ఇచ్చింది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications