Asia Cup 2022: నో హైప్.. నో టెన్షన్.. అఫ్గానిస్థాన్‌లానే పాకిస్థాన్: రోహిత్ శర్మ

దుబాయ్: ఫైనల్లో ఓడినా పెద్దగా పట్టించుకోం.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చేతిలో చిత్తయినా చింతలేదు. కానీ పొరుగు దేశం పాకిస్థాన్ చేతిలో ఓటమిని మాత్రం జీర్ణించుకోలేం.! గెలిస్తే.. విశ్వాన్ని జయించినంతగా సంబురపడతాం. ఓడితే ఆగ్రహంతో కారు చీకట్ల కమ్ముకుంటాయి. కోట్లాది హృదయాలు మూగబోతాయి. లక్షలాది గుండెలు భగ్గుమంటాయి. హీరోలు.. జీరోలు అవుతారు. పూల వర్షం పడిన చోట.. రాళ్ల వర్షం కురుస్తుంది. ఎవరూ ఊహించని, మరెవరూ ఆలోచించలేని మహాద్భుత ఘట్టాలు.. హై వోల్టేజ్ ఉత్కంఠలు.. ఊపిరి బిగపట్టే క్షణాలు.. ఉప్పొంగే నరాలకు.. వేదిక కానున్న భారత్, పాకిస్థాన్ ఆసియాకప్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. మరో నాలుగో రోజుల్లో(ఆగస్టు 28) ఈ ఉత్కంఠ పోరుకు తెరలేవనుంది.

హైరానాపడాల్సిన అవసరం లేదు..
యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌ను తాము మాత్రం సాధారణ పోరులానే భావిస్తామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. హైఓల్టేజ్ మ్యాచ్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో మాట్లాడిన హిట్ మ్యాన్.. ఈ మ్యాచ్‌కు ఉన్న హైప్‌ను చూసి బెదిరిపోవద్దని యువ ఆటగాళ్లకు సూచించినట్లు చెప్పాడు. అఫ్గానిస్థాన్ ఎలాగో పాకిస్థాన్‌తో మ్యాచ్ కూడా అంతేనని, హైరానా పడాల్సిన అవసరం లేదన్నాడు. పాకిస్థాన్‌ను సైతం ఇతర ప్రత్యర్థుల్లానే ట్రీట్ చేయాల్సిన అవసరం ఉందన్నాడు.

ఒత్తిడి ఉంటుంది.. కానీ
'భారత్ Xపాకిస్థాన్ మ్యాచ్‌ను ప్రతీ ఒక్కరు చూస్తారు. ఇది చాలా ఒత్తిడితో కూడుకున్న మ్యాచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ జట్టులో సాధారణ పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది. మేం ఈ మ్యాచ్‌ను ఎక్కువ హైప్ చేయాలనుకోవడం లేదు. మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌తో ఇప్పటి వరకు ఆడని ఆటగాళ్లు, ఒకటి, రెండు సార్లు మాత్రమే ఆడిన ప్లేయర్లు ఏ మాత్రం హైరానా పడాల్సిన అవసరం లేదు. ఇతర ప్రత్యర్థుల్లానే పాకిస్థాన్ ఓ జట్టు మాత్రమే అనే మైండ్‌సెట్ ఉండాలి.'అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

డిఫెండింగ్ చాంపియన్‌గా..
ఇక ఆసియాకప్ టోర్నీలో భారత జట్టును నడిపించడం రోహిత్ శర్మకు ఇదే తొలిసారి కాదు. 2018లో అతని సారథ్యంలోనే భారత్ చాంపియన్‌గా నిలిచింది. అయితే అప్పుడు పాకిస్థాన్ బలహీనంగా ఉండటంతో భారత్ పని సులువైంది. కానీ ఇప్పుడు ఆ జట్టు చాలా బలంగా తయారైంది. అయితే భారత్ కూడా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సత్తా చాటేందుకు సమయాత్తం అవుతోంది. విరాట్ కోహ్లీ సైతం ఈ టోర్నీతోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications