For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఒక్క వికెట్ తీసుంటే ఫలితం మరోలా ఉండేది: రోహిత్ శర్మ

Rohit Sharma says if we would have taken another wicket, things would have been different

మొహాలీ: చెత్త ఫీల్డింగ్, పేలవ బౌలింగే ఆస్ట్రేలియా చేతిలో తమ ఓటమికి ప్రధాన కారణమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టీ20 ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాతో సన్నాహకంగా జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియాకు చుక్కెదురైంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ.. బ్యాటర్లు అద్భుతంగా రాణించినా.. బౌలర్లు విఫలమయ్యారని తెలిపాడు.

ఇక బ్యాటింగ్ అనుకూలమైన వికెట్‌పై లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే అసాధారణ ఫీల్డింగ్‌తో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీయాలన్నాడు. అయితే ఐదు వికెట్లు పడగొట్టినా.. ఆరో వికెట్ తీయడంలో తాము విఫలమయ్యామని ఆ తప్పిదమే తమ ఓటమిని శాసించిందన్నాడు.

చెత్త ఫీల్డింగ్..

చెత్త ఫీల్డింగ్..

'మేం చాలా చెత్తగా బౌలింగ్ చేశాం. 200 పరుగుల స్కోర్ కాపాడుకోవాల్సింది. మైదానంలో మాకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాం. మా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. కానీ బౌలర్లే సత్తా చాటలేకపోయారు. ఈ తప్పిదాలను మెరుగుపరుచుకోవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ మాకు ఓ మంచి గుణపాఠం లాంటిది. ఇది ఓ హై స్కోరింగ్ మైదానమని, 200 పరుగులు చేసినా ప్రశాంతంగా ఉండలేమని మాకు ముందే తెలుసు. మేం కొంత మేర వికెట్లు తీసాం. కానీ ప్రత్యర్థి జట్టు అద్భుతంగా ఆడింది.

ఆ ఒక్క వికెట్ తీసుంటే..

ఆ ఒక్క వికెట్ తీసుంటే..

ఆసీస్ బ్యాటర్లు అసాధారణ షాట్స్‌తో ఆకట్టుకున్నారు. చేంజింగ్ టీమ్‌లో నేనున్నా.. ఈ లక్ష్యం అధిగమించవచ్చని చెప్పేవాడిని. అయితే ఐదు వికెట్లు తీసిన మేం.. ఆరో వికెట్ తీయడంలో విఫలమయ్యాం. ఈ వికెట్ గనుక కొంచెం ముందుగా తీస్తే ఫలితం మరోలా ఉండేది. ఇక ప్రతీ రోజు మనం 200 పరుగులు చేయలేం. కాబట్టి ఇలాంటి వికెట్లపై బ్యాటింగ్ ఆస్వాదించాడు. హార్దిక్ అద్భుతంగా ఆడారు. తదుపరి మ్యాచ్‌కు మా తప్పిదాలను సరిదిద్దుకొని బరిలోకి దిగుతాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. టీమ్ డేవిడ్‌తో కలిసి మాథ్యూ వేడ్ 6వ వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ పార్ట్‌నర్‌షిప్ టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది.

హార్దిక్ మెరిసినా..

హార్దిక్ మెరిసినా..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71 నాటౌట్) చెలరేగగా.. కేఎల్ రాహుల్(35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55), సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్ రెండు, జోష్ హజెల్ వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు.

చితక్కొట్టిన గ్రీన్, మాథ్యూ వేడ్..

చితక్కొట్టిన గ్రీన్, మాథ్యూ వేడ్..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కామెరూన్ గ్రీన్ (30 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) విధ్వసంకర ఇన్నింగ్స్ ఆడగా.. మాథ్యూవేడ్(21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. చాహల్‌కు ఓ వికెట్ దక్కింది. ఇక విజయంపై పట్టు బిగించిన సమయంలో హర్షల్ పటేల్ క్యాచ్ నేలపాలు చేయడంతో పాటు ధారళంగా పరుగులివ్వడం టీమిండియా కొంపముంచింది.

Story first published: Wednesday, September 21, 2022, 7:25 [IST]
Other articles published on Sep 21, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+