Rohit Sharma: ఆ మాటలు పట్టించుకోను.. విమర్శకులకు హిట్ మ్యాన్ చురకలు!

ముంబై: బయటి వ్యక్తులు మాట్లాడే మాటలను తాను ఏ మాత్రం పట్టించుకోనని టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టీమిండియాకు సారథిగా వ్యవహరించడమంటే తీవ్రమైన ఒత్తిడి కలిగించే అంశమేనని హిట్ మ్యాన్ తెలిపాడు. ఇక వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలిగించి రోహిత్ శర్మకు అప్పగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి కొందరు మద్దతు తెలపగా.. మరికొందరు విరాట్ కోహ్లీని తప్పించిన విధానం సరిగ్గాలేదని విమర్శించారు. దాంతో టీమిండియా కెప్టెన్సీ మార్పు హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే వచ్చిన విమర్శలపై రోహిత్ స్పందించాడు.

ఈ విమర్శలు కామన్..
బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ విమర్శకులకు చురకలంటించాడు.'భారత జట్టుకు ఆడేటప్పుడు ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ఇక సారథ్యం అంటే మామూలు విషయం కాదు. క్రికెట్ అభిమానులు మనలోని పాజిటివ్‌లు, నెగిటివ్‌ల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే క్రీడాకారుడిగా నాకు మాత్రం ఆట మీద దృష్టిసారించడమే ముఖ్యం. ప్రజలు ఏం మాట్లాడుకుంటారనే దానిని ఎవరూ ఆపలేరు. జట్టుకు అవసరమైనప్పుడు నా భాగస్వామ్యం తప్పకుండా ఇస్తా. అలానే భారీ టోర్నమెంట్లలో ఆడేటప్పుడు మిగతా జట్టు సభ్యులు కూడా అర్థం చేసుకుని రాణించేందుకు ప్రయత్నిస్తారు.

బయటి మాటలు అనవసరం..
మేం ఏమి చేయగలమో దాని మీదనే దృష్టి పెడతాం. విజయం సాధించేందుకు ఆడతాం. అంతేగానీ బయట ఎవరెవరో ఏదేదో మాట్లాడుకుంటారనే దాని గురించి ఆలోచించం. అవన్నీ పనికిరానివి. జట్టులోని ప్రతి ఒక్కరూ ముఖ్యమే. అందరితోనూ మంచి అనుబంధం ఉంది. దానిని ఇంకా బలోపేతం చేసుకుంటాం. అప్పుడే మేం ఏం సాధించాలని అనుకుంటున్నామో దానిని చేరుకోగలం. దీని కోసం రాహుల్ ద్రవిడ్ పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నాడు. కాబట్టే ముందుకు వెళ్లగలుగుతున్నాం'' అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

2019 వన్డే ప్రపంచకప్ నుంచి..
2019 వన్డే ప్రపంచకప్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ఊహాగానాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. మైదానాల్లో వీరి ప్రవర్తన కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. అయితే ఇంగ్లండ్ పర్యటన ముందు నుంచి రోహిత్, విరాట్ మళ్లీ క్లోజ్ అయ్యారు. ఒకప్పటిలానే ఒకరికొకరు సహాయసహకారాలు అందుకున్నారు. కానీ తాజా బీసీసీఐ నిర్ణయం మళ్లీ వీరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చేలా చేసింది. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. భారత్, సౌతాఫ్రికా మధ్య జనవరి 19 నుంచి మూడు3 వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications