ఆ క్షణం నా గుండె పగిలింది.. గదిలో ఒక్కడినే కూర్చోని ఏడ్చా: రోహిత్ శర్మ

ముంబై: మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు 2011 వన్డే ప్రపంచకప్ గెలిచి నిన్నటికి(శనివారం) సరిగ్గా 11 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా నాటి మధురక్షణాలను అభిమానులతో పాటు భారత క్రికెటర్లు నెమరువేసుకున్నారు. అయితే 2011 వన్డే ప్రపంచకప్ జట్టులో ఆడే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నటీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తాను పడ్డ బాధను పంచుకున్నాడు. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదనే వార్తతో తన గుండె పగిలినట్లయిందని, ఏం చేయాలో అర్థం కాలేదన్నాడు. తాజాగా భారత మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్.. నాటి గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న తాను గదిలో ఒంటరిగా ఉండి తీవ్రంగా మదన పడ్డానని తెలిపాడు.

తట్టుకోలేకపోయా..
'2011 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదనే వార్తను జీర్ణించుకోలేకపోయాను. చాలా కష్టంగా అనిపించింది. ఏ ఆటగాడికైనా ప్రపంచప్ ఆడాలనేది కల. దాంతోనే తట్టుకోలేకపోయాను. ఆ సమయంలో నేను సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నా. భారత్ తరఫున సిరీస్ ఆడుతున్నా. ఈ విషయం గురించి నేను ఎవరితో కూడా మాట్లాడలేదు. గదిలో ఒంటరిగా కూర్చొని తీవ్రంగా బాధపడ్డాను. ఎక్కడ తప్పు చేసాను.. ఎందుకు సెలెక్ట్ అవ్వలేదని ఆలోచించాను. ఇంకా మెరుగ్గా రాణించిల్సిందా? అని మదనపడ్డాను.

మరింత కసిగా ఆడా...
అయితే అప్పుడు తన వయసు 24 ఏళ్లేనని అలా బాధపడటం, సహనం కోల్పోవడం సర్వ సాధారణమే. అయితే నాకు ఇంకా క్రికెట్ ఆడే అవకాశం ఉందని రియలైజ్ అయ్యా. ప్రపంచం ఏం ఆగిపోలేదని నన్ను నేను సమర్థించుకున్నా. మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నించా. మరింత కసిగా ఆడి అవకాశం దక్కించుకున్నా'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ వల్లే..
2008 అండర్ 19 ప్రపంచకప్ గెలిచి భారత క్రికెట్‌లోకి విరాట్ కోహ్లీ తార జువ్వాలా దూసుకురావడంతో రోహిత్ శర్మకు అవకాశం దక్కలేదు. కెరీర్ ఆరంభంలో రోహిత్ శర్మ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసేవాడు. అతని స్థానంలో నిలకడగా రాణిస్తున్న విరాట్ కోహ్లీకి అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని కోహ్లీ అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఫైనల్లో క్లిష్ట పరిస్థితుల్లో తీవ్ర ఒత్తడి మధ్య గౌతమ్ గంభీర్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.

ధోనీ సూపర్ సిక్స్‌తో..
ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి రెండో సారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన విన్నింగ్స్ సిక్సర్ ఇప్పటికీ భారత అభిమానుల కళ్ల ముందు కదులాడుతూనే ఉంటుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ రెండేసి వికెట్లు, హర్బజన్ సింగ్ ఒక వికెట్ తీశాడు. అనంతరం టీమిండియా... గౌతమ్ గంభీర్(97), మహేంద్ర సింగ్ ధోనీ(91 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని చేధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications