Rohit Sharma: కష్టాన్నే నమ్ముకుంటా.. వాటిని అస్సలు విశ్వసించను!
Rohit Sharma, World Cup 2023 Final: ఆరా (Aura)ను తాను అస్సలు నమ్మనని, కష్టాన్నే నమ్ముతానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. ఈ బిగ్ ఫైనల్ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. ఆసక్తికర సమాధానాలిచ్చాడు.
టీమ్ జైత్రయాత్ర గురించి ఓ మీడియా ప్రతినిథి ప్రశ్నించగా.. రోహిత్ శర్మ తనదైన శైలిలో బదులిచ్చాడు. 'ఆరా (Aura)పై నాకు నమ్మకం లేదు. రేపు మేం అత్యుత్తమ క్రికెట్ ఆడితేనే విజేతలుగా నిలుస్తాం. గత 10 మ్యాచ్‌ల్లో మేం ఏం చేశామనేది కూడా అనవసరం. రేపు గనుక మేం తప్పిదాలు చేస్తే.. ఇన్ని రోజులుగా మేం పడ్డ కష్టమంతా వృథా అవుతోంది.

ఈ ప్రపంచకప్‌లో మేం ఇదే మంత్రాన్ని అనుసరించాం. గతంతో సంబంధం లేకుండా ప్రతీ మ్యాచ్‌లో అత్యుత్త ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నించాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఇక, 2011 నాకు చాలా కష్ట సమయం . కానీ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో భారత జట్టుకు నాయకత్వం వహిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అది ఇవాళ జరిగింది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ వరల్డ్ కప్ కోసం తాము రెండేళ్ల కిందటే సన్నాహాలు ప్రారంభించామని రోహిత్ వెల్లడించాడు. తాను కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సన్నద్ధమవుతున్నామని తెలిపాడు. జట్టులో ఏ ఆటగాడు ఏ పాత్ర పోషించాలన్న దానిపై స్పష్టత ఉందని, అప్పగించిన బాధ్యతలు నెరవేర్చగల సరైన ఆటగాళ్లను గుర్తించి వారిని జట్టులోకి తీసుకున్నామని వివరించాడు.
ఈ టోర్నీలో 23 వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా కొనసాగుతున్న మహ్మద్ షమీపై రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. 'ఆరంభ మ్యాచ్‌ల్లో మహమ్మద్ షమీని జట్టులోకి తీసుకోకపోవడం కఠినమైన అంశం. గొప్ప విషయం ఏంటంటే.. ఆ సమయంలో షమీ... సిరాజ్, ఇతర పేసర్లకు ఎంతో అండగా నిలిచాడు.
ఏమాత్రం నిరాశ చెందకుండా షమీ తన బౌలింగ్‌ను మరింత మెరుగుపరుచుకున్నాడు. నెట్స్‌లో గంటలకొద్దీ శ్రమించాడు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications