
5 రోజులు ఎక్కడ ఆడుతున్నారు..?
అందరూ పిచ్ గురించే ఎందుకు మాట్లాడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నాడు. ఈ వికెట్‌పై అద్బుత ప్రదర్శన కనబర్చిన ఖవాజా, పుజారా, లయన్‌లను మెచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. భారత్‌లో మూడు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్‌లు ముగియడంపై ఎదురైన ప్రశ్నకు రోహిత్ తనదైన శైలిలో కౌంటరిచ్చాడు. భారత్ బయట ఐదు రోజుల పాటు టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయా? అని ఎదురు ప్రశ్నించాడు. గురువారం ముగిసిన సౌతాఫ్రికా-వెస్టిండీస్ తొలి టెస్ట్ కూడా మూడు రోజుల్లోనే ముగిసిందని గుర్తు చేశాడు.

పాక్‌లో ఏమైందో మనం చూడలేదా..?
ఫ్లాట్ పిచ్‌లతో ఐదు రోజుల పాటు ఫలితం తేలకుండా మ్యాచ్‌లు ఆడితే టెస్ట్ ఫార్మాట్‌కు ఆదరణ పెరుగుతుందా? అని ప్రశ్నించాడు. పాకిస్థాన్‌లో ఇలానే ఫ్లాట్ వికెట్స్‌పై ఆడితే మ్యాచ్‌లు బోరింగ్‌గా ఉన్నాయని ఇదే జనాలు కామెంట్ చేయలేదా? అని నిలదీసాడు. టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే తాము ఎలాంటి పిచ్‌లపై ఆడాలనేది నిర్ణయించుకున్నామని, అందరం కలిసి తీసుకున్న నిర్ణయమని చెప్పాడు. ఈ తరహా వికెట్లను ఉపయోగించడం వల్ల తమకు కూడా సవాళ్లు ఎదురవుతాయనే అవగాహన తమకు ఉందని, దానికి సిద్దంగా ఉండే బరిలోకి దిగామని స్పష్టం చేశాడు.

బ్యాటింగ్ వైఫల్యమే..
పేలవ బ్యాటింగ్‌తోనే ఈ మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని స్పష్టం చేశాడు. 'ఓ టెస్ట్ మ్యాచ్‌లో పరాజయం ఎదురైందంటే.. చాలా విషయాలు మనకు అనుగుణంగా జరగలేదని అర్థం. తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. పరుగులు చేయడం ఎంత ముఖ్యమో తొలి ఇన్నింగ్స్ వైఫల్యంతో తెలుసుకున్నాం. ప్రత్యర్థికి 80-90 పరుగుల ఆధిక్యం లభించినప్పుడు మేం బ్యాట్‌తో గొప్ప ప్రదర్శన చేయాల్సింది. కానీ చేయలేకపోయాం. కేవలం 75 పరుగుల ఆధిక్యం మాత్రమే సాధించాం. నిజాయితీగా చెప్పాలంటే ఈ లక్ష్యం సరిపోదని మాకు కూడా తెలుసు.

జట్టుగా మెరుగవ్వాలి..
మ్యాచ్‌ను పూర్తి చేసి ఫ్రెష్‌గా రీగ్రూప్ అయ్యి మా తప్పిదాలపై ఫోకస్ పెట్టాలనుకున్నాం. జట్టుగా మేం మెరుగవ్వాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ఈ ఓటమితో తెలుసుకున్నాం. ఆసీస్ బౌలర్లు ఒకే స్పాట్‌లో బౌలింగ్ చేసేలా మేం తప్పు చేశాం. వారి బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగానే మేం ఈ మ్యాచ్‌లో ఓడిపోయాం. ముఖ్యంగా నాథన్ లయన్ అదరగొట్టాడు. చాలెంజింగ్ పిచ్‌ల్లో మెరుగ్గా బౌలింగ్ చేయాలి. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన విధంగా ఈ మ్యాచ్‌లో మా బ్యాటింగ్ సాగలేదు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఇలాంటి ఫలితం ఒకటి రావచ్చు. ఈ పరిస్థితుల్లోనే కలిసికట్టుగా రాణించాల్సి ఉంటుంది. జట్టులోని కొందరు ప్లేయర్లు రాణిస్తారని భావించాం. కానీ అలా జరగలేదు. పరిస్థితులను మాకు అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications












