టాస్‌ల వల్లే మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఒక్క మాటతో తేల్చిసిన రోహిత్ శర్మ! (వీడియో)

దుబాయ్: ఆసియాకప్ 2022 టోర్నీలో టాస్ కీలక పాత్ర పోషించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. టాస్ గెలవకపోవడం వల్లే తాము ఓటమిపాలయ్యామని పరోక్ష వ్యాఖ్యలతో రోహిత్ శర్మ తేల్చేసాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో టాస్ పాత్ర అంతగా ఉండదని ఆశిస్తున్నానని తెలిపాడు. అఫ్గానిస్థాన్‌తో గురువారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 122 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగి రెండున్నరేళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు. దాంతో మ్యాచ్ అనంతరం విరాట్‌తో కలిసి రోహిత్ సరదాగా మాట్లాడాడు.
హిందీలో అడుగుతున్నావ్...
చాలా జోవియల్‌గా మాట్లాడుకున్న ఇద్దరు జట్టుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముందుగా రోహిత్ హిందీలో కోహ్లీ ఇన్నింగ్స్‌ను కొనియాడాడు. కోహ్లీ 71వ సెంచరీ కోసం యావత్ భారత్ వేచి చూసిందని, మధ్యలో ఎన్నో ఘనతలు అందుకున్నా.. ఇది మాత్రం ప్రత్యేకమైన ఇన్నింగ్స్ అంటూ ప్రశంసిస్తూ ఈ ఫీలింగ్ ఎలా ఉందని అడిగాడు. దీనికి కోహ్లీ నవ్వుతూ హిందీలో అడుగుతున్నాడని కెమెరావైపు చూసాడు. వెంటనే రోహిత్.. హిందీ, ఇంగ్లీష్ మిక్స్ చేసి అడగాలనుకున్నానని, కానీ హిందీలోనే ఆ రిథమ్ వుంటుందని ఫిక్సయ్యానని చెప్పాడు.

స్పెషల్ ఇన్నింగ్స్..
ఇక రోహిత్ మాటలకు విరాట్ ధన్యవాదాలు తెలిపాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో తాను రాణించడం ముఖ్యమని భావించానని చెప్పిన విరాట్.. దాని కోసం తీవ్రంగా కష్టపడ్డానని తెలిపాడు. రోహిత్‌తో పాటు మేనేజ్‌మెంట్ తనకు అండగా ఉందని చెప్పాడు. టీ20 ఫార్మాట్‌కు తగ్గట్లు తన ఆటను కూడా మార్చుకోవడంపై ఫోకస్ పెట్టానని, ధాటిగా ఆడేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించానన్నాడు. ఇక ఈ సెంచరీ తాను ఊహించలేదని, ఇది చాలా ప్రత్యేకమైనదని చెప్పాడు.

దూకుడుగానే కాకుండా..
ఇక రోహిత్ మాట్లాడుతూ.. తాము టీ20 ఫార్మాట్ అనగానే ధాటిగా ఆడటం అనుకున్నామని, కానీ విరాట్ మరో కోణం చూపించాడని తెలిపాడు. క్రీజులో సెట్ అయిన తర్వాత కూడా ధాటిగా ఆడవచ్చని, పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయడం ఎంత అవసరమో అనే విషయాన్ని ఈ మ్యాచ్ ద్వారా తమకు చూపించాడని రోహిత్ కొనియాడాడు. విరాట్ బ్యాటింగ్ చూడటం అద్భతమని, అతను ఫామ్‌లోకి రావడం తమ జట్టుకు చాలా ముఖ్యమని రోహిత్ సంతోషం వ్యక్తం చేశాడు.

టాస్ కీలకం కాదని..
ఇక మూడు ఫార్మాట్లలో ఆడటమే తన లక్ష్యమని తెలిపిన కోహ్లీ.. దానికి తగ్గట్లు తన ఆటను మలుచుకున్నానని చెప్పాడు. భారీ సిక్స్‌లు కొట్టడం తన బలం కాదని, గ్యాప్ షాట్స్ ఆడటంపై స్పెషల్ ఫోకస్ పెట్టానన్నాడు. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాలనుకున్నానని, క్రీజులో సెట్ అయిన తర్వాత ధాటిగా ఆడటం తనకు సులువని, అదే చేశాననని చెప్పాడు. కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి రావడం జట్టుకు కలిసొచ్చే అంశమని, జట్టు మరింత బలంగా తయారవుతుందని కోహ్లీ కొనియాడాడు. టీ20 ప్రపంచకప్ వరకు జట్టుగా ఇదే జోరును కొనసాగించాలని, అప్‌కమింగ్ రెండు సిరీస్‌లను అన్ని విధాల వాడుకోవాలన్నాడు. ఇక చివరగా రోహిత్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా టాస్ కీలకం కాకుడదని కోరుకుంటున్నానని నవ్వుతూ అన్నాడు. అక్కడ తమ శక్తి మేర రాణిస్తామని తెలిపాడు. దీనికి విరాట్ కోహ్లీ సైతం నవ్వుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications