షేన్ వార్న్, మురళీధరణ్ బౌలింగ్ ఆడలేదు కానీ అతనే నెంబర్ వన్ ఓవర్‌సీస్ బౌలర్: రోహిత్ శర్మ

ఇండోర్: ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లయన్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత గడ్డపై అద్భుత ప్రదర్శన కనబర్చిన నెంబర్ వన్ ఓవర్‌సీస్ బౌలరని కొనియాడాడు. తాను దిగ్గజ స్పిన్నర్లు షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరణ్ బౌలింగ్ ఆడలేదని, కానీ నాథన్ లయన్ వారి కంటే మెరుగైన బౌలరని పేర్కొన్నాడు. ఇండోర్ వేదికగా శుక్రవారం ముగిసిన మూడో టెస్ట్‌లో లయన్ దెబ్బకు టీమిండియా 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.

అత్యధిక వికెట్ల వీరుడిగా..
తొలి ఇన్నింగ్స్‌లో మూడు కీలక వికెట్లు తీసిన లయన్.. రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. దాంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన నెంబర్ వన్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే రికార్డును అధిగమించాడు. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ(12)ను ఔట్ చేసిన లయన్.. ఇప్పటి వరకు భారత గడ్డపై 53 వికెట్లు తీసిన లయన్.. టాప్‌లో ఉన్న ఇంగ్లండ్ బౌలర్ డీఎల్ అండర్ వుడ్(54) రికార్డుకు వికెట్ దూరంలో నిలిచాడు.

నెంబర్ వన్ ఓవర్‌సీస్ బౌలర్..
మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ లయన్‌ను ఆకాశానికెత్తాడు. 'నా అభిప్రాయం ప్రకారం నాథన్ లయన్ టాప్ బౌలర్. ముత్తయ్య మురళీధరణ్, షేన్ వార్న్ బౌలింగ్ నేను ఆడలేదు కానీ.. ప్రస్తుత తరంలో లయన్‌ను మించిన ఓవర్‌సీస్ బౌలర్ లేడు. భారత గడ్డపై సత్తా చాటే నెంబర్ వన్ ఓవర్‌సీస్ బౌలర్ అతనే. లైన్ అండ్ లెంగ్త్ విషయంలో ఎంతో నిలకడను ప్రదర్శిస్తున్నాడు. ఇంత ఖచ్చితత్వంతో బౌలింగ్ చేస్తూ.. అంత సులువగా పరుగులు ఇవ్వకుంటే ఏ బ్యాటర్ అయినా ఇబ్బంది పడుతాడు.

భయపడని బౌలర్..
బహుషా ఇది అతని మూడో భారత పర్యటన అనుకంట. తొలి పర్యటనలో నేను లేనప్పటికీ అతని బౌలింగ్‌ను చూశాను. అతను చాలా అనుభవం కలిగిన బౌలర్. బ్యాటర్ల హిట్టింగ్‌కు ఏ మాత్రం భయపడడు. అది కెప్టెన్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ఎందుకంటే లయన్ లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేస్తాడనే నమ్మకం ఉంటుంది కాబట్టి.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. పేలవ బ్యాటింగ్‌తో మూడో టెస్ట్‌లో ఓటమి పాలయ్యామని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.

పేలవ బ్యాటింగ్‌తో..
'ఒక టెస్టు మ్యాచ్‌లో ఓడిపోతే.. చాలా విషయాలు మన చేతుల్లో లేవని అర్థం. తొలుత బ్యాటింగ్‌లో సరైన ఆరంభం దక్కలేదు. ప్రత్యర్థి 80 - 90 పరుగుల ఆధిక్యం సాధించాక.. తొలి ఇన్నింగ్స్‌లో మా స్కోరు బోర్డుపై మరిన్ని పరుగులు ఉంటే బాగుండేదనిపించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ అనుకున్న విధంగా బ్యాటింగ్ సాగలేదు. ఆసీస్‌కు కేవలం 76 పరుగులనే లక్ష్యంగా నిర్దేశించాం. తొలి రెండు మ్యాచుల్లో ఎలా రాణించాం.. ఇప్పుడీ మ్యాచ్‌లో ఎందుకు ఓడిపోయామనేదానిపై అందరం కలిసి చర్చించుకుంటాం. ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ఆలోంచించలేదు. తర్వాత అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం.

వ్యూహాత్మక తప్పిదాలతో..
పిచ్‌లతో సంబంధం లేకుండా మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. సవాళ్లతో కూడుకున్న పిచ్‌లపై ధైర్యంగా ఆడాలి. బౌలింగ్‌లో రాణించినప్పటికీ.. బ్యాటింగ్‌లో ఆ తెగువ చూపించలేకపోయాం. ప్రణాళికలను అమలు చేయడంలో జరిగిన తప్పిదాల వల్లే ఇలా ఓటమిబాట పట్టాల్సి వచ్చింది. తప్పకుండా పుంజుకుంటాం. మూడు రోజుల్లో మ్యాచుల్లో అన్ని చోట్లా జరుగుతున్నాయి. పాకిస్థాన్‌లో ఇలా జరిగింది. మరీ ఐదు రోజులు ఆడితే బోర్ కొడుతుందని జనాలే అంటారు' అని రోహిత్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications