For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎన్ని పరుగులు చేశానన్నది కాదు.. ఎన్ని బంతులు ఆడానన్నదే ముఖ్యం: రోహిత్ శర్మ

Rohit Sharma says Hardik Pandya is ready to do what team expects from him
India vs England : Focus On Series, No Time For Dress Rehearsal Here - Rohit Sharma| Oneindia Telugu

అహ్మదాబాద్‌: టెస్ట్ క్రికెట్‌లో తనకు ఎన్ని పరుగులు చేశానన్నది కాదు.. ఎన్ని బంతులు ఆడానన్నదే ముఖ్యమని టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తెలిపాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో రాణించిన భారత ఓపెనర్‌.. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో భారత టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. తన శైలికి భిన్నంగా క్రీజ్‌లో ఎక్కువ సేపు నిలబడి పరుగులు చేసేందుకు ప్రయత్నించానని, అది తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని రోహిత్‌ అన్నాడు. ఇప్పుడు పరుగులకంటే ఎక్కువ బంతులు ఆడగలగడమే తనకు సంతృప్తినిస్తోందని అతను చెప్పాడు. ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఐదు టీ20ల సిరీస్ నేపథ్యంలో హిట్ మ్యాన్ బుధవారం మీడియాతో మాట్లాడాడు.

అలవాటు లేని పని..

అలవాటు లేని పని..

'మనకు అలవాటు లేని పనులు సమర్థంగా చేయగలిగితే అదే ఒక చిన్నపాటి విజయంలాగా అనిపిస్తుంది. గత రెండు టెస్టు సిరీస్‌ల్లో నా బ్యాటింగ్‌ చాలా సంతృప్తినిచ్చింది. చివరి టెస్టులో 49 పరుగులే చేసినా 150 బంతులు ఆడాను.అంటే నా సహజ శైలికి భిన్నంగా సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో నిలవగలిగాను. ఇక షాట్లు ఆడాలని అనిపించినప్పుడల్లా నన్ను నేను నియంత్రించుకోగలిగా. ఒక్క తప్పుడు షాట్‌ కూడా ఆడకుండా క్రమశిక్షణతో బ్యాటింగ్‌ చేశా. అందుకే ఆ 49 పరుగులు సంతృప్తినిచ్చాయి. ఇప్పుడు నాకు టెస్టుల్లో సవాల్‌ ఎన్ని పరుగులు చేశానన్నది కాదు. ఎన్ని బంతులు ఆడానన్నదే ముఖ్యం. 100, 150, 200...ఇలా ఎన్ని ఎక్కువ బంతులు ఆడితే సహజంగానే ఆపై పరుగులు వస్తాయి' అని రోహిత్‌ వ్యాఖ్యానించాడు.

హార్దిక్ బౌలింగ్‌కు రెడీ..

హార్దిక్ బౌలింగ్‌కు రెడీ..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బంతితోనూ సత్తా చాటుతాడని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా రాణించేందుకు పాండ్యా రెడీగా ఉన్నాడని తెలిపాడు. 'జట్టులో పాండ్యా కూడా ఓ భాగం. గత కొన్ని వారాలుగా బౌలింగ్, బ్యాటింగ్ కోసం అతను చాలా శ్రమిస్తున్నాడు. తన స్కిల్స్ మెరుగుపర్చుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. అవకాశం వస్తే వైట్ బాల్ సిరీస్‌లోనూ సత్తా చాటేందుకు రెడీగా ఉన్నాడు. టీమ్ అవసరాలేంటో అతనికి బాగా తెలుసు. వాటిని నెరవేర్చడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటాడు.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

పంత్ సూపర్..

పంత్ సూపర్..

రిషభ్ పంత్.. తన శక్తి మేరకు ఆడితే వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ఆస్ట్రేలియా నుంచి మొదలుపెడితే ఇంగ్లండ్‌తో హోమ్‌ సిరీస్ వరకు పంత్ సూపర్భ్‌గా ఆడాడని కితాబిచ్చాడు. బ్యాటింగ్, అప్రోచ్, కీపింగ్ బాగుందని మెచ్చుకున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను టీ20 ప్రపంచకప్‌కు డ్రెస్ రిహార్సల్‌గా భావించడం లేదన్నాడు. మెగా ఈవెంట్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతానికైతే సిరీస్ గెలవడంపైనే తాము దృష్టిపెట్టామన్నాడు. 'ప్రెజెంట్‌పై దృష్టి పెడితే ఫ్యూచర్ బాగుంటుంది. ఇది లాంగ్ సిరీస్. ఇది గెలవడమే మాకు ముఖ్యం. టీమ్ స్టాండింగ్స్, వ్యక్తిగత ప్రదర్శనలను చూసుకోవాల్సి ఉంది. నాతో కలిసి ఓపెనింగ్ ఎవరు చేస్తారో నేను చెప్పలేను. మ్యాచ్ టైమ్ వరకు ఆగాల్సిందే.'అని చెప్పుకొచ్చాడు.

న్యూట్రల్ అంపైర్లను రప్పించాలి..

న్యూట్రల్ అంపైర్లను రప్పించాలి..

అంతర్జాతీయ క్రికెట్ రీస్టార్ట్ అయిన తర్వాత కూడా న్యూట్రల్ అంపైర్లు మ్యాచ్‌లకు ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని రోహిత్ అన్నాడు. ప్లేయర్ల మాదిరిగానే వాళ్లను కూడా పర్యటనలకు రప్పించాలన్నాడు. తమతో పాటు అంపైర్లు క్వారంటైల్‌లో పెట్టి కష్టాలు చూపెట్టాలని రోహిత్ చమత్కరించాడు. 'న్యూట్రల్ అంపైర్లను ఓ ఆప్షన్‌గా పరిగణించాలి. ప్లేయర్లు ట్రావెల్ చేస్తుండగా లేనిది అంపైర్లకు ఏమొచ్చింది. వాళ్లను ఎందుకు టూర్స్‌కు తీసుకురావడం లేదో తెలియడం లేదు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో అంపైర్లు బాగా పని చేశారు'అని పేర్కొన్నాడు.

Story first published: Thursday, March 11, 2021, 9:02 [IST]
Other articles published on Mar 11, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+