చెన్నై: విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అసాధారణ బ్యాటింగ్‌తోనే వన్డే ప్రపంచకప్ 2023లో శుభారంభం చేసామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయానంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. ఈ గెలుపు క్రెడిట్ కోహ్లీ, రాహుల్‌దేనని స్పష్టం చేశాడు. చేజింగ్‌లో టీమిండియాకు దక్కిన ఆరంభం చూసి భయపడ్డానని, కోహ్లీ, రాహుల్ సూపర్ పార్ట్‌నర్‌షిప్‌తో జట్టుకు విజయాన్నందించారని కొనియాడాడు.
'బౌలింగ్, ఫీల్డింగ్‌లో మేం అద్భుత ప్రదర్శన కనబర్చాం. ఈ రెండు విభాగాల్లో టాప్ క్లాస్ పెర్ఫామెన్స్ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చాం. కఠిన పిచ్‌పై బ్యాటర్లకు పరుగులివ్వకుండా కట్టడి చేశాం. ఈ వికెట్ స్పిన్నర్లతో పాటు పేసర్లకు అనుకూలంగా ఉంది. సీమర్స్‌కు రివర్స్ స్వింగ్ అయ్యింది. మా బౌలర్లు సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేశారు. సమష్టి ప్రదర్శన కనబర్చారు.

బ్యాటింగ్‌లో మేం ఆశించిన ఆరంభాన్ని అందుకోలేకపోయాం. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడం చూసి నేను ఆందోళనకు గురయ్యా. చేజింగ్‌లో ఇలాంటి ఆరంభాలు అస్సలు ఉండకూడదు. ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు తీసారు. ఇందులో చెత్త షాట్లు కూడా ఉన్నాయి. అయితే పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయాలనే ఆలోచనతో ఈ తరహా తప్పిదాలు జరగడం సహజం.
విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌కు హ్యాట్సాఫ్. తీవ్ర ఒత్తిడిలో అసాధారణ భాగస్వామ్యంతో జట్టు విజయానికి బాటలు వేసారు. ఇక తదుపరి వేదికపై ఆడటం మాకు సవాల్‌తో కూడుకున్నది. ఈ టోర్నీలో మాకు అతిపెద్ద సవాల్ కూడా ఇదే. దేశవ్యాప్తంగా వివిధ వేదికల్లో భిన్నమైన పరిస్థితుల్లో ఆడాల్సి ఉంది. టీమ్ కాంబినేషన్ కూడా మారొచ్చు.
ఓ జట్టుగా ఈ సవాల్‌కు మేం సిద్దంగా ఉన్నాం. చెన్నై అభిమానులు ఎప్పుడూ నిరాశపరచరు. తీవ్ర ఉక్కపోత మధ్యలో కూడా మ్యాచ్‌కు హాజరై మాకు అండగా నిలిచారు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది. స్టీవ్ స్మిత్(71 బంతుల్లో 5 ఫోర్లతో 46), డేవిడ్ వార్నర్(52 బంతుల్లో 6 ఫోర్లతో 41) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/28) మూడు వికెట్లుతీయగా.. కుల్దీప్ యాదవ్(2/42), జస్‌ప్రీత్ బుమ్రా(2/35) రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(116 బంతుల్లో 6 ఫోర్లతో 85), కేఎల్ రాహుల్(115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 97 నాటౌట్) చెలరేగారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ ఓ వికెట్ తీసాడు.