Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిడ్నీలో రోహిత్‌ సురక్షితంగానే ఉన్నాడు.. ఎలాంటి ప్రమాదం లేదు: బీసీసీఐ

Rohit Sharma safe in quarantine in Sydney says BCCI
Ind vs Aus 2020 : No Need To Move Rohit Sharma From Sydney, He Is Safe - BCCI

ముంబై: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను సిడ్నీ నుంచి తరలించాల్సిన అవసరం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. అక్కడ రోహిత్ సురక్షితంగానే ఉన్నాడని పేర్కొంది. ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్టు సరీస్ కోసం రోహిత్ శర్మ కొద్ది రోజుల క్రితమే సిడ్నీ చేరుకున్నాడు. అయితే కరోనా వైరస్ నిబంధనల మేరకు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని అక్కడి అధికారులు ఆదేశించారు. దాంతో రోహిత్ ప్రస్తుతం సిడ్నీలోనే క్వారంటైన్‌లో ఉన్నాడు.

సిడ్నీలో కరోనా కేసులు

సిడ్నీలో కరోనా కేసులు

గత కొద్దిరోజులుగా సిడ్నీలో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరుకోవడంతో ఇప్పటికే సిడ్నీ సరిహద్దుల్ని మూసివేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. కఠినంగా నిబంధనల్ని అమలు చేస్తోంది. అయితే సిడ్నీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడే ఉన్న రోహిత్‌ శర్మకు కూడా కరోనా సోకుతుందేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై బీసీసీఐ అధికారి స్పందించారు. రోహిత్‌ పూర్తిగా బీసీసీఐతో పాటు టీం మేనేజ్‌మెంట్ పర్యవేక్షణలో సురక్షితంగా ఉన్నాడని, అతడికి అక్కడి నుంచి వేరే చోటికి తరలించాల్సిన అవసరం లేదని ప్రకటించారు.

సిడ్నీ నుంచి తరలించాల్సిన అవసరం లేదు

సిడ్నీ నుంచి తరలించాల్సిన అవసరం లేదు

'రోహిత్ శర్మ ప్రస్తుతం తన గదిలో ఒంటరిగా ఉంటున్నాడు. రోజువారీ వ్యాయామాలను గదిలోనే చేస్తున్నాడు. భారత్ నుంచి ఆస్ట్రేలియా బయలుదేరే సమయంలోనే రోహిత్‌తో పాటు ఓ ఫిజియోను అపాయింట్ చేశాం. వారి పర్యవేక్షణలోనే రోహిత్ ఉంటున్నాడు. ప్రతి రోజూ వ్యాయామం చేస్తూ మ్యాచ్ సమయానికి ఫిట్‌గా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. అతడికి ఎలాంటి ప్రమాదం లేదు. సిడ్నీ నుంచి తరలించాల్సిన అవసరం లేదు' అని బీసీసీఐ అధికార ప్రతినిధి తెలిపారు. రోహిత్ ప్రస్తుతం సిడ్నీలోని డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌లో క్వారంటైన్‌లో ఉన్నాడు.

 నో ప్రాక్టీస్

నో ప్రాక్టీస్

సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌ సమయానికి 14 రోజుల క్వారంటైన్‌ని పూర్తి చేసుకుని రోహిత్ శర్మ జట్టుతో కలవాల్సి ఉంది. కానీ సిడ్నీలో కరోనా కేసులు ఇప్పుడు టీమిండియాతో పాటు రోహిత్‌లోనూ కంగారు పెంచుతున్నాయి. అపార్ట్‌మెంట్ నుంచి వెలుపలికి వచ్చే ఛాన్స్ లేకపోడంతో రోహిత్‌కి ప్రాక్టీస్ చేసే అవకాశం లేకపోయింది. దాంతో ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్ తర్వాత నేరుగా మూడో టెస్టులో రోహిత్ ఆడనున్నాడు.

మెల్‌బోర్న్‌లోనే మూడో టెస్టు?:

మెల్‌బోర్న్‌లోనే మూడో టెస్టు?:

మెల్‌బోర్న్ వేదికగా డిసెంబరు 26 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే భారత్, ఆస్ట్రేలియా జట్లు మూడో టెస్టు కోసం సిడ్నీకి వెళ్లాల్సి ఉంది. కానీ అక్కడ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మూడో టెస్టుని కూడా మెల్‌బోర్న్‌లో నిర్వహించే ఆలోచనలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

బాక్సింగ్‌ డే టెస్టు: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. స్టార్ ఓపెనర్ దూరం?

Story first published: Tuesday, December 22, 2020, 15:29 [IST]
Other articles published on Dec 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+