Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన బౌలర్!(వీడియో)

ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(83 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 బ్యాటింగ్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రోహిత్.. తనదైన శైలిలో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్‌ బౌలింగ్‌లో రోహిత్ శర్మ కొట్టిన పుల్ షాట్ సిక్సర్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

హిట్ మ్యాన్ ట్రేడ్ మార్క్ సిక్సర్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో మార్క్‌వుడ్ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ ఈ భారీ సిక్సర్ బాదాడు. ఈ ఓవర్ నాలుగో బంతిని మార్క్‌వుడ్.. 152 కిలోమీటర్ల వేగంతో షాట్ పిచ్ బాల్‌గా సంధించగా.. రోహిత్ శర్మ తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్‌తో ఫైన్ లెగ్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు.

Rohit Sharma s trade-mark pull shot for six leaves Mark Wood stunned in Dharamshala Test

రోహిత్ పుల్ షాట్‌ను చూసిన మార్క్ వుడ్ బిత్తరపోయాడు. 152 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతిని అలా ఎలా? సిక్సర్ బాదడని ఆశ్చర్యపోయాడు. పుల్‌షాట్ కొట్టడంలో రోహిత్ శర్మను మించిన వాడు లేడని, ఇది అతని కెరీర్‌లో ఓ అత్యుత్తమ సిక్సర్‌గా నిలిచిపోతుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ సిక్స్‌లు కనువిందుగా ఉంటాయని, ఈ మ్యాచ్‌లో అతను మరిన్ని సిక్స్‌లు బాదాలని ఆకాంక్షిస్తున్నారు.

టీమిండియా టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ సైతం రోహిత్ శర్మ పుల్ షాట్‌కు ఫిదా అయ్యాడు. రోహిత్ శర్మ, పుల్ షాట్ ఎప్పటికీ కనువిందుగా ఉంటాయని కామెంట్ చేశాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 57.4 ఓవర్లలో 218 పరుగులకు కుప్పకూలింది. జాక్ క్రాలీ(108 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 79)ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. బెన్ డక్కెట్(27), ఓలీ పోప్(11), జోరూట్(26), జానీ బెయిర్ స్టో(29), బెన్ స్టోక్స్(0), టామ్ హార్ట్‌లీ(6), మార్క్ వుడ్(0)తీవ్రంగా నిరాశపరిచారు.

భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(5/72), 100వ టెస్ట్ హీరో రవిచంద్రన్ అశ్విన్(4/51) ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. జడేజాకు ఓ వికెట్ దక్కింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. పడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57), రోహిత్ శర్మ(83 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

శుభ్‌మన్ గిల్(26 బ్యాటింగ్), రోహిత్ శర్మతో క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్‌కు ఓ వికెట్ దక్కింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 83 పరుగుల వెనుకంజలో ఉంది.

Story first published: Thursday, March 7, 2024, 18:40 [IST]
Other articles published on Mar 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+