For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అభిమానుల అత్యుత్సాహం.. రోహిత్ శర్మ ఆగ్రహం(వీడియో)

అభిమానం హద్దులు దాటుతోంది. ఫ్యాన్స్ అత్యుత్సాహం సెలెబ్రిటీలకు శాపంగా మారింది. మొన్న బుమ్రా, నిధి అగర్వాల్.. నిన్న అల్లు అర్జున్, రోహిత్ శర్మ అభిమానులు అత్యుత్సాహంతో ఇబ్బందులకు గురయ్యారు. తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన అభిమానులను రోహిత్ శర్మ మందలించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కారులో నెమ్మదిగా వెళ్తున్న రోహిత్ శర్మను చూసిన కొందరు అభిమానులు.. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు రోహిత్ చేతులను లాగుతూ ఫొటోలు దిగే ప్రయత్నం చేశారు. దాంతో అసహనానికి గురైన రోహిత్.. వారి హెచ్చరిస్తూ.. కారు అద్దాలు మూసి వేసి ముందుకు సాగాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Rohit Sharma s Stern Warning to Kids Caught on Camera Viral Video Sparks Buzz

ఆ మధ్య టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. రాజాసాబ్ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను అభిమానులు చుట్టుముట్టి అసభ్యంగా తాకారు. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా‌, విరాట్ కోహ్లీలు కూడా ఇలానే అభిమానుల అత్యుత్సాహంతో ఇబ్బంది పడ్డారు. బుమ్రా అనుమతి లేకుండా వీడియో తీస్తున్న ఓ అభిమాని ఫోన్‌ను అతను లాగి పడేసాడు. సెల్ఫీ కోసం తన దగ్గరకు వచ్చిన అభిమాని కోహ్లీ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.

పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్‌ను కూడా ఇలానే అభిమానులు చుట్టు ముట్టి ఇబ్బంది పెట్టారు. ఈ వరుస ఘటనలు అభిమానుల అత్యుత్సాహానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అభిమానులు కాస్త హద్దుల్లో ఉండాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.

అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న హిట్ మ్యాన్.. ఇప్పటికే ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టి 10 కిలోల బరువు తగ్గాడు. వన్డేల్లో సెంచరీల మోత మోగించాడు. న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌తో మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.

Story first published: Monday, January 5, 2026, 14:22 [IST]
Other articles published on Jan 5, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+