
రోహిత్ ఒక్కడే ...
మెగా లీగ్ ప్రారంభానికి ముందు కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న వేళ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి తన ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ ప్రేమికులందరికీ షాకిచ్చాడు. టీమ్‌లో తనకెంతో నమ్మకస్తుడైన రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించాడు. దాంతో కెప్టెన్సీ అనుభవమే లేని జడేజా చెన్నైని నడిపించనున్నాడు. ఇక పది జట్ల కెప్టెన్ల జాబితాను చూస్తే.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మనే టాప్ సారథిగా కనిపిస్తున్నాడు. ధోనీ తప్పుకోవడంతో రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు.

అంతా యువ సారథులే..
ఇప్పటికే ఐదు టైటిళ్లు గెలిచిన హిట్ మ్యాన్.. 129 ఐపీఎల్ మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. మిగతా కెప్టెన్లలో ఎవరికీ కూడా అతనిలో సగం మ్యాచ్‌ల అనుభవం కూడా లేదు. గత సీజన్‌తోనే విరాట్ కోహ్లీ సారథ్యాన్ని వదులు కోవడం, ప్రతికూల పరిస్థితుల్లో డేవిడ్ వార్నర్ తన సారథ్యాన్ని కోల్పోవడంతో అన్ని జట్లు తమ కొత్త సారథులను ఎంచుకున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్ మినహా.. అంతా కొత్త సారథులే ఉన్నారు. రోహిత్ శర్మ తర్వాత శ్రేయస్ అయ్యరే 41 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత కేన్ విలియమ్సన్(33), కేఎల్ రాహుల్(27), రిషభ్ పంత్(16), సంజూ శాంసన్(14), మయాంక్ అగర్వాల్(1) ఉన్నారు.

హార్దిక్, జడేజా, డుప్లెసిస్ కొత్త..
అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అనుభవమున్న డుప్లెసిస్‌ను ఆర్‌సీబీ తమ నూతన సారథిగా ఎంచుకుంది. ఎన్నో ఏళ్లుగా క్యాచ్ రిచ్ లీగ్ ఆడుతున్న ఫాఫ్‌కు కెప్టెన్సీ అవకాశం రాలేదు. సీనియర్ ప్లేయర్, అనుభవం ఉన్న కెప్టెన్ అయినా ఐపీఎల్ కెప్టెన్సీ మాత్రం కొత్తే. ఇక హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా తొలిసారి కెప్టెన్‌గా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గుజరాత్ టైటాన్స్‌ను హార్దిక్ నడిపిస్తుండగా.. చివరి నిమిషంలో సీఎస్‌కే సారథిగా జడేజా ఎంపికయ్యాడు. అసలు జడేజాకు అండర్19 మినహా ఏ స్థాయి క్రికెట్‌లోనూ కెప్టెన్‌గా అనుభవం లేదు. మయాంక్ అగర్వాల్ గత సీజన్ ఒకే ఒక మ్యాచ్‌కు సారథ్యం వహించాడు.

IPL 2022 కెప్లెన్లు... అనుభవం!
రోహిత్ శర్మ-129
శ్రేయస్ అయ్యర్-41
కేన్ విలియమ్సన్-33
కేఎల్ రాహుల్-27
రిషభ్ పంత్-16
సంజూ శాంసన్-14
మయాంక్ అగర్వాల్-1
రవీంద్ర జడేజా-0,
డుప్లెసిస్-0,
హార్దిక్-0


Click it and Unblock the Notifications
