For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ భాయ్..వడపావ్ తింటావా? (వీడియో)

ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దుమ్మురేపాడు. 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీలో బరిలోకి దిగిన రోహిత్.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు. గ్రూప్‌ సీలో భాగంగా సిక్కింతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. 61 బంతుల్లో శతకం సాధించాడు.

రోహిత్(94 బంతుల్లో 18 ఫోర్లు, 9 సిక్స్‌లతో 155) భారీ శతకంతో ఈ మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ కూడా దక్కింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తమ అభిమాన ఆటగాడు రోహిత్ శర్మను చూసేందుకు స్టేడియానికి ఎగబడ్డారు.

Rohit Sharma s Funny Response to Vada Pav Chants Steals the Show in Vijay Hazare Trophy

అయితే ఈ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సరదా సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. రోహిత్ శర్మ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని అతన్ని ఆటపట్టించాడు. 'రోహిత్ భాయ్..వడపావ్ తింటావా? 'అని గట్టిగా అరిచాడు. దానికి రోహిత్ వద్దు అంటూ సైగలు చేశాడు. రోహిత్ శర్మకు వడపావ్ ఇష్టమైన ఆహారం అన్న సంగతి తెలిసిందే.

వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు. కఠినమైన డైట్, వ్యాయామంతో ఇప్పటికే 10 కిలోల బరువు తగ్గాడు. వన్డే ప్రపంచకప్ 2027 వరకు కఠినమైన డైట్, వ్యాయామాలను చేయాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నాడు. జంక్‌ఫుడ్, తీపి పదార్థలకు దూరంగా ఉంటున్నాడు. టీమ్ సెలెబ్రేషన్స్‌లో కట్ చేసే కేకును కూడా తినడం లేదు. సౌతాఫ్రికాతో వైజాగ్ వేదికగా జరిగిన వన్డేలో యశస్వి జైస్వాల్ సెంచరీ చేశాడు. ఈ సెంచరీని కేక్ కట్ చేసి యశస్వి సెలెబ్రేట్ చేసుకోగా.. ఈ కేక్ తినేందుకు రోహిత్ నిరాకరించాడు. కేక్ తింటే మళ్లీ లావై పోతానని తెలిపాడు. ఈ క్రమంలోనే వడాపావ్ తింటావా? అని అభిమాని అడిగితే వద్దని చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సిక్కిం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 236 పరుగులు చేసింది. అశిష్ తాపా(79) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం ముంబై 30.3 ఓవర్లలో 2 వికెట్లకు 237 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మతో పాటు అంగ్‌క్రిష్ రఘువంశీ(38) రాణించాడు.

Story first published: Thursday, December 25, 2025, 14:32 [IST]
Other articles published on Dec 25, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+