అందుకే జడేజాను అప్‌ది ఆర్డర్ పంపించాం.. ఇషాన్ బ్యాటింగ్ కేక: రోహిత్ శర్మ

లక్నో: గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రోల్ పట్ల తమకు స్పష్టత ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అతను జట్టులోకి రావడం సంతోషంగా ఉందన్నాడు. జడేజా నుంచి ఎక్కువ ఆశిస్తున్నామని, అందుకే అప్‌ది ఆర్డర్ బ్యాటింగ్ పంపించామని చెప్పాడు. శ్రీలంకతో గురువారం జరిగిన తొలి టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 62 పరుగుల తేడాతో ఘన విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. ఈ విజయానంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్‌తో పాటు జడేజాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇక తమ ఫీల్డింగ్ వైఫల్యం కొనసాగుతుందని, దీనిపై సీరియస్‌గా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు.

ఇషాన్ సూపరో సూపర్..
‘క్రికెట్‌లో అప్పుడప్పుడు ఫామ్ కోల్పోవడం సహజమే. ఇషాన్ కిషన్ సామర్థ్యం, మైండ్ సెట్ నాకు బాగా తెలుసు. ఈ రోజు అతని బ్యాటింగ్ చాలా చూడ ముచ్చటగా అనిపించింది. పవర్ ప్లే అనంతరం అతను నిర్మించిన ఇన్నింగ్స్ సూపరో సూపర్. కేవలం బంతిని బాదడమే కాకుండా.. గ్యాప్స్‌లో బౌండరీలు రాబట్టాడు. జడేజా జట్టులోకి రావడం సంతోషంగా ఉంది. అతని నుంచి మేం చాలా ఆశిస్తున్నాం. అందుకే అప్‌ది ఆర్డర్‌లో బ్యాటింగ్ పంపించాం. భవిష్యత్తులో కూడా బ్యాటింగ్‌లో అతనికి ప్రమోషన్ ఇస్తాం. అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లోదుమ్మురేపాడు.

ఫీల్డింగ్‌పై ఫోకస్ పెట్టాలి..
అలాంటి ఫామ్‌నే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగించాలని ఆశిస్తున్నాం. ముందు ముందు మరిన్ని మ్యాచ్‌ల్లో జడేజాను అప్‌ది ఆర్డర్‌లో ఆడిస్తాం. పెద్ద మైదానాల్లో ఆడటం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే బ్యాట్స్‌మన్ అసలు సిసలు సత్తా తెలుస్తోంది. కోల్‌కతాలో టైమింగ్‌తో సిక్స్ కొట్టొచ్చు. కానీ ఇక్కడ అలా కుదరదు. ఈ మ్యాచ్‌లో కూడా మేం క్యాచ్‌లు నేలపాలు చేశాం. ఈ లెవెల్‌లో ఇలాంటి తప్పిదాలు చేయడం ఏమాత్రం బాలేదు. మా ఫీల్డింగ్ కోచ్ దీనిపై వర్క్ చేసి మెరుగుపరుస్తాడనుకుంటున్నా. ఆస్ట్రేలియా వేదికగా జరిగే ప్రపంచకప్‌లో బెస్ట్ ఫీల్డింగ్ సైడ్‌గా మేం నిలవాలనుకుంటున్నా'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన
టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' ఇషాన్ కిషన్ (56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 89) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 నాటౌట్), రోహిత్ శర్మ (32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 44) మెరుపులు మెరిపించారు. అనంతరం శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చరిత్ అసలంక (47 బంతుల్లో 5 ఫోర్లతో 53 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్, వెంకటేశ్ అయ్యర్ రెండేసి వికెట్లు తీయగా.. జడేజా, చాహల్ చెరొక వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications