Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే సంజూ శాంసన్‌ను తీసుకోలేదు: రోహిత్ శర్మ

బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఏం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. జట్టుగా విభిన్నంగా ప్రయత్నిద్దామనే ఛేజింగ్‌కు మొగ్గు చూపానని తెలిపాడు. వరల్డ్ కప్ నేపథ్యంలో ఎలాంటి సందేహాలు లేకుండా టీమ్ కాంబినేషన్ ఎంచుకోవాలనుకుంటున్నామని తెలిపాడు.

ప్రపంచకప్ కోసం ఆటగాళ్ల సత్తాను పరీక్షిస్తామని, ఈ క్రమంలో ఫలితాలపై అస్సలు రాజీపడని చెప్పాడు. ఓవైపు ప్రయోగాలు చేస్తూనే మరోవైపు విజయాల కోసం కృషి చేస్తామని తెలిపాడు. మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు పరిస్థితులను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. విండీస్‌తో సిరీస్‌లో తాము అనుకున్న ఫలితాన్ని అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Rohit Sharma reveals the reason why Sanju Samson not playing 1st ODI vs West Indies

నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నామని చెప్పిన రోహిత్.. ఈ క్రమంలోనే అక్షర్ పటేల్‌ను తీసుకోలేదన్నాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం సంజూ శాంసన్‌ను పక్కనపెట్టాల్సి వచ్చిందన్నాడు. అక్షర్ పటేల్‌కు బదులు శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు.

గాయంతో జట్టుకు దూరమైన మహమ్మద్ సిరాజ్ స్థానంలో ముకేష్ కుమార్ అరంగేట్రం చేయగా.. ఉమ్రాన్ మాలిక్ రీఎంట్రీ ఇచ్చాడు.

ప్రతీ సిరీస్ ముఖ్యమైనేదనని, ప్రతీ మ్యాచ్, సిరీస్ గెలవాల్సిందేనని వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ అన్నాడు. టాప్ టీమ్‌పై గెలిచే అవకాశం తమకు దక్కిందని, తమ జట్టులో క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారని తెలిపాడు. సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేయడమే తమ లక్ష్యమని, తమ అవకాశాలను అందిపుచ్చుకుంటామని తెలిపాడు.

గతంలో కొన్ని అవకాశాలను తాము చేజార్చుకున్నామని, సమిష్టి ప్రదర్శన చేస్తే విజయం సాధించవచ్చన్నాడు. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచి విజయాన్నందకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. ఒషానే థామస్, అల్జారీ జోసెఫ్, కెవిన్, కీసీ కార్టీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారని తెలిపాడు.

తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముకేష్ కుమార్

వెస్టిండీస్: షై హోప్, కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, అలిక్ అథంజే, షిమ్రాన్ హెట్‌మైర్, రోవ్‌మన్ పోవెల్, రోమారియో షెఫెర్డ్, యాన్నిక్ కరయ్య, డొమినిక్ డ్రేక్స్, జైడన్ సీల్స్, గుడకేశ్ మోతీ

Story first published: Thursday, July 27, 2023, 19:24 [IST]
Other articles published on Jul 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+